నిషేధిత గుట్కా పట్టుకున్న జగిత్యాల పోలీసులు
జగిత్యాల పట్టణంలోని గాంధీనగర్ లో గురువారం పెట్రోలింగ్ చేస్తుండగా కోరుట్ల నుండి జగిత్యాల వైపుకు వెళ్తున్న కార్ ను ( TS 09 FG 3878) నేరస్తుడు పెట్రోలింగ్ వెహికిల్ ని చూసి కూడా ఆపకుండా పారిపోతూ ఎదురుగా వస్తున్న మోటార్ సైకిల్ ని ఢీకొట్టి రోడ్డు పక్కన ఉన్న కోళ్ళ దుకాణం ను ధ్వంసం చేస్తూ వేగంగా వెళ్లగా అందులో 20 కోళ్ళు చనిపోయాయి. పైగా 4 ఎలక్రికల్ పోల్స్ లను ఢీ కొట్టగా అవి కూడా విరిగిపోయాయి. ఇక వారు ప్రయాణిస్తున్న కార్ లో తనిఖీ చేయగా ప్రభుత్వ నిషేధిత గుట్కా దాదాపుగా రూ. 5, 00, 000/ అయిదు లక్షల రూపాయల విలువ కల దాన్ని స్వాధీనం చేసుకుని నేరస్తుడు ఇచ్చిన సమాచారం మేరకు నిర్మల్ పట్టణానికి వెళ్ళి అక్కడ హీరా పాన్ స్టోర్ నందు తనిఖీ చేయగా (యజమాని షఫిక్ అహ్మెద్ షేక్) దుకాణం నందు రూ. 4, 00, 000/- విలువ గల నిషేధిత గుట్కా ను స్వాదినపర్చుకొనైనది. షఫిక్ అహ్మెద్ r/o నిర్మల్ పరారీలో ఉన్నాడు. స్వాధీన పర్చుకున్న గుట్కా విలువ రూ. 9 లక్షలు కలదు. కేస్ నమోదుచేసి విచారణ ప్రారంభించామని జగిత్యాల ఎస్డిపీవో ఆర్. ప్రకాష్ తెలిపారు.