రెండు వారాల్లో నోటిఫికేషన్ రాకుంటే ప్రగతి భవన్ ముట్టడే: ఆర్. క్రిష్ణయ్య
తెలంగాణలో ఖాళీగా ఉన్న సుమారు 2.50 లక్షల ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం రెండు వారాల్లో నోటిఫికేషన్ జారీ చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. లేకుంటే వేలాది మంది నిరుద్యోగులతో కలిసి ప్రగతి భవన్, మంత్రుల నివాసాలను ముట్టడిస్తామని అన్నారు. బీసీ భవన్ లో తెలంగాణ నిరుద్యోగుల ఐకాస, విశ్వవిద్యాలయాల విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో జరిగిన నిరుద్యోగుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉద్యోగాల భర్తీ పేరుతో 14 నెలలుగా నిరుద్యోగులకు ఆశలు కల్పిస్తూ కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు.