తమిళనాడులో జల్లికట్టు ప్రారంభం.. 14 మందికి గాయాలు
తమిళనాడులో జల్లికట్టు పోటీలు జోరుగా కోనసాగుతున్నాయి. ఈ పోటీని నిర్వహించేందుకు ప్రభుత్వం అనుమతినివ్వడంతో పోటీలో యువకులు ఉత్సహంతో పోటీపడుతున్నారు. ఈ క్రమంలో 14 మంది తీవ్రంగా గాయపడ్డారు. అందులో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తుంది. కాగా, మధురై అవనియాపురంలో జల్లికట్టు ప్రారంభమైంది. ఈ పోటీల్లో 100 ఎద్దులు, 300కి పైగా యువకులు పాల్గొన్నారు. తమిళనాడు సర్కార్ జల్లికట్టు పోటీల్లో పాల్గోనేందుకు కేవలం 300 మందికి మాత్రమే అనుమతి ఉంటుందని, పోటీలను చూసేందుకు 150 మంది ప్రేక్షకులు లేదా 50 శాతం సిట్టింగ్ సామర్థ్యానికి మించకుడాదని సూచించింది. పోటీలకు ప్రారంభానికి 48 గంటల ముందు కొవిడ్ నెగిటివ్ సర్టిఫికెట్ ఉంటేనే తీసుకోవాలిని ఆదేశాలు జారి చేసింది. కాని అక్కడ అలాంటి పరిస్థితి కనిపించడంలేదు. ప్రస్తుతం కరోనా కేసుల విలయం తమిళనాడులో కొనసాగుతోంది. కాని, ఎవరికి కూడా మాస్క్ లు మాస్కులు లేవు.. భౌతిక దూరం లేదు..! వందల్లోనే ప్రేక్షకులను అనుమతించాలంటూ రూల్ పెట్టారు.. అయితే ప్రేక్షకులు మాత్రం వేలాల్లో వచ్చారు. ఇంతలోనే జల్లికట్టుతో నిబంధనలకు బ్రేక్ పడినట్లయింది.