మొండెంలేని తల కేసులో వీడిన మిస్టరీ

0 14

దేవరకొండ నియోజకవర్గంలోని చింతపల్లి మండల పరిధిలో విరాట్‌నగర్ కాలనీలోని మహాంకాళీ మైసమ్మ దేవతా పాదాల వద్ద లభ్యమైన వ్యక్తి తల కేసులో మిస్టరీ వీడింది. హత్యకు సంబంధించి మొండెన్ని రంగారెడ్డి జిల్లా తుర్కయాంజల్ బ్రహ్మణపల్లి ఎక్స్ రోడ్డు సమీపంలో కమ్మగూడెంలో నిర్మాణంలో ఉన్న బిల్డింగ్ వద్ద ఇటుకల గుట్ట మధ్య మెండెంను కనుగొన్నారు. వివరాల్లోకి వెళ్లే..

మొండెంలేని తల కేసులో వీడిన మిస్టరీ

ఈ నెల 10వ తేదీన చింతపల్లి మండల పరిధిలోని హైదరాబాద్- నాగర్జునసాగర్ జాతీయ రహదారిపై విరాట్‌నగర్ కాలనీలోని మహాంకాళీ మైసమ్మ దేవతా పాదాల వద్ద గుర్తు తెలియని వ్యక్తి తల ఉండడంతో జిల్లావ్యాప్తంగా కలకలం రేగింది. దీంతో ఈ కేసు పోలీసులకు సవాలుగా మారి.. హతుడి వివరాలను సోషల్ మీడియోలో పోస్టు చేస్తూ హతుడి సూర్యాపేట జిల్లా పాలకవీడు మండల పరిధిలోని శూన్యంపహడ్‌కు చెందిన జైహింద్ నాయక్‌గా గుర్తించారు.

Also Read :

కానీ హతుడి మొండెం కోసం పోలీసులు 8 బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చేపట్టారు. జిల్లా ఎస్పీ రెమా రాజేశ్వరి ఈ కేసును సీరియస్‌గా తీసుకుని సీసీఎస్ డిఎస్పీ మొగులయ్యకు ఈ కేసు గాలింపు బాధ్యతలు అప్పగించారు. దీంతో మొగులయ్య ఆధ్వర్యంలో పోలీసులు పకడ్బందీగా పలు కోణాల్లో కేసును దర్యాప్తు చేపట్టారు. ప్రధాన సెంటర్లలో సీసీ పుటేజ్‌లను పరిశీలించారు. దీంతో రంగారెడ్డి జిల్లా తుర్కయాంజల్ బ్రహ్మణపల్లి ఎక్స్ రోడ్డు సమీపంలో కమ్మగూడెంలో నిర్మాణంలో ఉన్న బిల్డింగ్ వద్ద ఇటికల మధ్య తల లేని మెండెంను కనుగొన్నారు. రంగారెడ్డి జిల్లా తుర్కయాంజల్‌లో హత్యచేసి తలను నల్గొండ జిల్లాలో వేయడంపై పోలీసులు నిందితుల వేటలో పడ్డారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like
error: Content is protected !!
Karimnagar News page contents