అక్కినేని ఇంట మోగనున్నపెళ్లి బాజా.. అఖిల్‌కి మంచి సంబంధం చూసిన నాగార్జున..!

0 16

అక్కినేని హీరోలకు పెళ్లిళ్లు అచ్చి రావడం లేదు. నాగార్జున .. వెంకటేష్ చెల్లెలు లక్ష్మిని పెళ్ళి చేసుకుని.. ఇద్దరు విడిపోయారు. ఆతరువాత అమలను పెళ్లి చేసుకున్నారు. ఇక నాగ చైతన్య.. సమంతను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఇక అఖిల్ కూడా నిశ్చితార్థం చేసుకొని ఆ తర్వాత క్యాన్సిల్ చేసుకున్నాడు.

Akkineni : అక్కినేని ఇంట మోగనున్నపెళ్లి బాజా.. అఖిల్‌కి మంచి సంబంధం చూసిన నాగార్జున..!

Marriage in Akkineni family very coming days అఖిల్- శ్రీయా భూపాల్ నిశ్చితార్థం గ్రాండ్ గా జరిగిన విషయం తెలిసిందే. శ్రియ ప్రముఖ పారిశ్రమామిక వేత్త జీవీకే కంపెనీల అధినేత మనుమరాలు.. అఖిల్-శ్రీయా భూపాల్ మ్యారేజ్ ఇటలీలో జరిపించాలని ఇరు ఫ్యామిలీలు డిసైడ్ అయ్యాయి. కానీ అంతలోనే అఖిల్-శ్రియ భూపాల్ మధ్య మనస్పర్థలు వచ్చాయనే టాక్ నడిచింది. దీంతో వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టకుండానే వారి పెళ్లికి శుభం కార్డు పడింది.అయితే ఈ బాధనుండి బయటపడటానికి ఇంట్లో మళ్ళీ ఓ శుభకార్యం చేయబోతున్నారట. అక్కినేని ఇంటికి కొత్త కొడలు రాబోతున్నట్టు తెలుస్తోంది. ఇంటికి పెద్ద కోడలు గా వచ్చిన సమంత .. మధ్యలోనే విడాకులు తీసుకుని వెళ్లిపోవడంతో.. ఇంటికి చిన్న కొడలును తీసుకురావాని నాగార్జున భావిస్తున్నారట. అంతే త్వరలో అఖిల్ పెళ్ళి చేయాలని ప్లాన్ చేస్తున్నారని టాక్.

అఖిల్ పెళ్ళి కోసం నాగార్జున మంచి సాంప్రదాయం కలిగిని ఫ్యామిలీ నుంచి అమ్మాయిని చూశారట. ఈ సంబంధం దాదాపు ఫిక్స్ అయినట్టే అని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇండస్ట్రీకి సంబంధం లేని అమ్మాయిని ఏరి కోరి ఫిక్స్ చేశారట నాగార్జున . మరి ఈ విషయం ఎంత వరకూ నిజం అనేది తెలియాలి అంటే.. అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చే వరకు ఆగాల్సిందే.

ఇక నాగార్జున – నాగచైతన్య కలిసి నటించిన బంగార్రాజు సినిమా రిలీజ్ అయ్యింది. మంచి టాక్ తో దూసుకుపోతోంది. అటు అఖిల్ కూడా సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో ఏజెంట్ సినిమా చేస్తున్నారు. సినిమాల పరంగా ఫుల్ బిజీగా ఉన్నారు అక్కినేని హీరోలు ముగ్గురు. పర్సనల్ లైఫ్ లో ముగ్గురు ఒకే సిచ్యూవేషన్ ను ఫేస్ చేశారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like
error: Content is protected !!
Karimnagar News page contents