: సోషల్‌ మీడియాలో అరుదైన రికార్డు అందుకున్న బన్నీ.. సౌత్‌ ఇండస్ట్రీలోనే మొదటి హీరోగా..

0

అల్లు అర్జున్‌.. ‘పుష్ప’ సినిమాతో పాన్‌ ఇండియా స్టార్‌గా మారిపోయాడీ టాలీవుడ్ ఐకాన్‌ స్టార్. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదలైన బన్నీ చిత్రం కలెక్షన్ల వర్షం కురిపించింది.

ఇక బాలీవుడ్‌లో ఇప్పటికే ఏకంగా 80 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి వంద కోట్ల వైపు దూసుకెళుతోంది. సినిమాల సంగతి పక్కన పెడితే అల్లు అర్జున్‌ సోషల్‌ మీడియాలో ఎంత చురుగ్గా ఉంటారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సినిమా విషయాలతో పాటు తన పిల్లలు, తదితర వ్యక్తిగత విషయాలను కూడా సామాజిక మాధ్యమాల ద్వారా ఫ్యాన్స్‌ తో పంచుకుంటాడు. అందుకే అతనికి రోజు రోజుకి ఫాలోవర్స్‌ పెరిగిపోతున్నారు. ఈక్రమంలో సోషల్‌ మీడియాలో అరుదైన రికార్డు సొంతం చేసుకున్నారు అల్లు వారబ్బాయి. ఈ సంక్రాంతి నాటికి బన్నీ ఇన్ స్టాలో 15 మిలియన్ల ఫాలోవర్లు చేరారు. దక్షిణాది సినీ పరిశ్రమలో ఈ రికార్డు అందుకున్న తొలి హీరో బన్నీనే కావడం విశేషం.

Allu Arjun: సోషల్‌ మీడియాలో అరుదైన రికార్డు అందుకున్న బన్నీ.. సౌత్‌ ఇండస్ట్రీలోనే మొదటి హీరోగా..

కాగా తనకు 15 మిలియన్ ఫాలోయర్స్ రావడంపై అల్లు అర్జున్ సంతోషంగా ఫీలయ్యాడు . తనపై అమితమైన ప్రేమాభిమానాలు కురిపిస్తున్న ఫ్యాన్స్ కు మనస్పూర్తిగా ధన్యవాదాలు తెలిపారు. ఇన్‌స్టాగ్రామ్ తో ట్విట్టర్‌ లోనూ బన్నీ ఫాలోయింగ్‌ మాములుగా లేదు. అక్కడ 6 మిలియన్ల మంది అతనిని అనుసరిస్తున్నారు. అలాగే ఫేస్ బుక్‌లో అయితే ఏకంగా 21 మిలియన్ ఫాలోయర్స్ పైగా ఉన్నారు. కాగా దక్షిణాది హీరోల్లో కేవలం విజయ్ దేవరకొండ మాత్రమే బన్నీకి దగ్గర్లో ఉన్నాడు. ఈ టాలీవుడ్ రౌడీకి ఇన్‌స్టాగ్రామ్‌లో 14.2 మిలియన్ ఫాలోవర్లు ఉన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like
error: Content is protected !!
Karimnagar News page contents