కరీంనగర్ లో వాడవాడలా సంక్రాంతి సంబరాలు

0 23

కరీంనగర్ పట్టణంలో వాడవాడలా సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. ఉదయమే నిద్ర లేచిన అమ్మాయిలు వాకిట్లో అందమైన రంగవల్లులు తీర్చి దిద్దడంలో తలమునకలై ఉన్నారు. వారికి సహకరిస్తూ వారి సోదరులు, పిల్లలు పండుగ సంతోషాన్ని ఘనంగా జరుపుకుంటున్నారు. మామిడి తోరణాలతో అలంకరించిన లోగిళ్ళు, రకరకాల పిండివంటలతో గుమగుమలాడే రుచులతో ప్రతి ఇంటా సంక్రాంతి పండుగ సంబరాలు ప్రారంభమయ్యాయి. ఈ వేడుకలను పురస్కరించుకొని సాంప్రదాయబద్దంగా తమ ఇళ్ళ ముందు చిన్న, పెద్ద ముగ్గులు వేసి రంగులతో అలంకరించారు. సంప్రదాయంగా వేసిన ముగ్గులు విశేషంగా ఆకట్టుకున్నాయి.

సంక్రాంతి పర్వదినం సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి ఆలయాలను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. సంక్రాంతి సందర్భంగా చేసిన సంప్రదాయ పిండివంటలను బంధుమిత్రులకు అందించి ఒకరికి ఒకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. పిల్లలు మైదానంలోకి గాలి పటాలను ఎగురవేసి ఆనందోత్సాహాలతో మునిగి తేలుతున్నారు.

Also Read :

Get real time updates directly on you device, subscribe now.

You might also like
error: Content is protected !!
Karimnagar News page contents