విద్యాసంస్థలకు సెలవులు పొడిగింపు
కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణలోని విద్యా సంస్థలకు సెలవులు పొడిగించే ఛాన్స్ కనిపిస్తోంది. సంక్రాంతి సెలవులు ఈ నెల 8వ తేదీ నుండి 16వ తేదీ వరకు ఉన్నాయి. 17వ తేదీన విద్యా సంస్థలు తెరుచుకోవాల్సి ఉంది. కానీ కరోనా ఉధృతి నేపథ్యంలో మరి కొన్ని రోజుల పాటు సెలవులు పొడిగిస్తే మేలని వైద్య ఆరోగ్య శాఖ ప్రభుత్వానికి సూచించినట్లు తెలుస్తోంది. ఈ నెల 20 తేదీ వరకు ర్యాలీలు, సభలు నిర్వహించకూడదనే ఆంక్షలు ఉన్నాయి. దీంతో విద్యా సంస్థలకు సైతం మొదట 20వ తేదీ వరకు సెలవులను పొడిగిస్తారని తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
లోకల్ యాప్ సంక్రాంతి సందర్బంగా రిఫరల్ కాంటెస్ట్ నిర్వహిస్తోంది. ఈ కాంటెస్ట్ లో పాల్గొని రూ.3 వేల వరకు బహుమతులు మీరు గెలుచుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం యాప్ ఓపెన్ చేయగానే పైన రూ.అనే సింబల్ కనిపిస్తుంది. దాని పై క్లిక్ చేస్తే పూర్తి వివరాలు మీకే తెలుస్తాయి.