నిష్పక్షపాతంగా, చట్టబద్ధంగా పనిచేస్తున్న పోలీసు అధికారులపై అసంబద్ధమైన ఆరోపణలు తగవు !!

0 32

నిష్పక్షపాతంగా, చట్టబద్ధంగా పనిచేస్తున్న పోలీసు అధికారులపై అసంబద్ధమైన ఆరోపణలు చేయడం తగదని పొలిసు సంఘాలు, ప్రజల కోసం అహర్నిశలు కష్టపడుతున్న పోలీసులను గౌరవించాలి కానీ నిందలు వేయకుడని పొలిసు సంఘం వారు కోరుతున్నారు… ఇటీవల జరిగిన పరిణామాలపై వారు ఏమి తెలియజేశారంటే..

కరీంనగర్ పోలీసులు నిష్పక్షపాతంగా స్నేహపూరిత వాతావరణంలో, చట్టబద్ధంగా విధులు నిర్వర్తిస్తూ, ప్రజల మద్దతు ప్రజల సహకారంతో చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు పాల్పడేవారిపై కఠిన వైఖరి అవలంబిస్తూ, ప్రజలలో పోలీస్ ల పట్ల గౌరవం, విశ్వాసం పెంపొందించెల పనిచేస్తున్నరని, అటువంటి పోలీస్ అధికారులపై స్వార్థ ప్రయోజనాల కోసం, అసంబద్ధమైన, అహేతుకమైన ఆరోపణలు చేయడం సరికాదని కరీంనగర్ పోలీస్ అధికారుల సంఘం తెలియజేస్తుంది !

ఇటీవల గౌరవ కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ గారు చేపట్టిన జాగరణ దీక్ష సందర్భంగా పోలీసులు విధినిర్వహణలో ఉండగా పలువురు నాయకులు పార్టీ కార్యకర్తలు చట్టబద్ధంగా విధులు నిర్వర్తిస్తున్న పోలీసులకు ఆటంకం కలిగిస్తూ, వారిపై దాడి చేయడం వల్ల కేసు నమోదు కాగా, అందులో పలువురిని అరెస్ట్ చేసి న్యాయస్థానం ముందు హాజరు పరచిన విషయం అందరికీ సుపరిచితమే !

అదే కేసులో మాజీ ఎమ్మెల్యే శ్రీమతి బొడిగె శోభ గారు కూడా నిందితురాలిగా ఉన్నారు. వారిని తేదీ 05-01-2022 రోజున అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచగా గౌరవ న్యాయస్థానం రిమాండ్ కు పంపడం జరిగింది.

కానీ జైలు నుండి విడుదలై బయటకు వచ్చిన తర్వాత శ్రీమతి బొడిగె శోభ గారు ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇస్తూ పోలీసు అధకారులపై పలు ఆరోపణలు చేయడం జరిగింది.

అందులో గౌరవనీయులైన కరీంనగర్ సీపీ గారు బి.జే.పి పార్టీ కార్యాలయం వద్ద తన చేయి పట్టుకున్నారని, మరియు అరెస్టు చేసే సందర్భంలో పోలీసులు తన కార్యాలయంలో హడావిడి చేశారని తర్వాత తనను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించే క్రమంలో, మధ్యలో కోతిరాంపుర్ వద్ద వాహనాన్ని ఆపి అందులో టూ టౌన్ సిఐ లక్ష్మీ బాబు, వన్ టౌన్ సిఐ నటేష్, కరీంనగర్ టౌన్ ఏసిపి మరియు కరీంనగర్ త్రీ టౌన్ సిఐ దామోదర్ రెడ్డి తన వాహనంలో ఎక్కి, శ్రీ బండి సంజయ్ కుమార్ గారు మరియు శ్రీమతి బొడిగే శోభగారిపై పలు కేసులు నమోదు చేస్తామని, వారిని శాశ్వతంగా జైల్లో పెడతామని బెదిరించి నట్టుగా ఆరోపణలు చేశారు.

అంతేకాకుండా గౌరవ న్యాయస్థానం తనను జైలుకు పంపిన తర్వాత కూడా జైల్లో సి పి గారు ఏ సి పి, మరియు సి ఐ లక్ష్మీ బాబు, దామోదర్రెడ్డి జైలు లోపలకు కూడా ప్రతిరోజు వచ్చి హడావిడి చేసినారని ఆరోపించారు.

ఈ సందర్భంగా ఆరోపణలు అవాస్తవమని అవి కేవలం ప్రచారం కోసం, అస్తిత్వం కోసం ప్రజలను తప్పుదారి పట్టించడానికి చేసిన ఆరోపణలని, అందులో ఇసుమంతైనా వాస్తవం లేదని ఆ ఆరోపణలను పోలీస్ అధికారుల సంఘం తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం !

తేదీ 02-01-2022 రోజున గౌరవ కరీంనగర్ ఎంపీ శ్రీ బండి సంజయ్ కుమార్ గారు అనుమతి లేకుండా , కొవిడ్ నిబంధనలకు విరుద్ధంగా చేపట్టిన జాగరణ దీక్ష సందర్భంగా ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరుకుండా అక్కడకు చేరుకున్న పోలీసులు, ఆ కార్యక్రమాన్ని కవర్ చేయడానికి వచ్చిన మీడియా మిత్రులు అక్కడ జరిగే ప్రతి సంఘటనను లైవ్ రికార్డ్ చేయడం, వీడియోగ్రఫీ చేయడం జరిగింది.

అంతేకాకుండా శ్రీమతి బొడిగె శోభ గారిని మరియు ఇతర మహిళా నాయకురాల్లను అరెస్ట్ చేసే క్రమంలో మహిళా పోలీసులు మహిళా పోలీసు అధికారులు మాత్రమే వారిని అరెస్ట్ చేశారు తప్ప మగ పోలీస్ అధికారులు ఎవరు కూడా వారిని పట్టుకోవడం, వాహనంలోకి ఎక్కించడం కానీ చేయలేదు అని తెలియజేస్తున్నాము. ఇది ప్రతి వీడియో లో ప్రతి ఎలక్ట్రానిక్ మీడియా ఛానల్ లో రికార్డ్ అయిన కెమెరాలలో కూడా ఉన్నదని తెలియజేస్తున్నాను.

ఇక రెండవ ఆరోపణ పోలీసులు తన ఇంట్లోకి దూరి, తనకు సమచారం ఇవ్వకుండా అరెస్ట్ చేశారని ఆరోపించారు. తేదీ: 3-1-2022 రోజు శ్రీ బండి సంజయ్ కుమార్ ఎంపీ గారిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చిన రిమాండ్ సిడిలో శ్రీమతి బొడిగె శోభ గారి పేరు కూడా ఉన్నది. అది అందరికీ తెలిసిన విషయమే అది పబ్లిక్ డాక్యుమెంట్. కోర్టు లో పలువురు అడ్వకేట్ లు, పార్టీ నాయకులు మరియు మీడియా మిత్రులు కూడా ఆ రిపోర్ట్ లో ఏముందని చూసారు. రిమాండ్లో ఏమి రాశారని టీవీ లో కూడా ప్రచారం చేయడం జరిగింది. మరి అటువంటప్పుడు అందులో నిందితురాలిగా ఉన్న విషయం నాకు తెలియదు అని శ్రీమతి బొడిగె శోభ గారు చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. అంతే కాకుండా అరెస్టు సమయంలో నిందితులకు మరియు వారి బంధువులకు అరెస్టు సమాచారాన్ని తెలియజేసే సెక్ట్షన్ (50) సి.ఆర్.పి.సి (50 A) సి ఆర్ పి సి నోటీసు ఇవ్వడం జరుగుతుంది. ఆ నోటీసుపై శ్రీమతి బొడిగ శోభ గారు మరియు ఆమె భర్త శ్రీ గాలన్న గారు సంతకం చేయడం జరిగింది. ఈ రెండు నోటీసులు జతపర్చి పంపిన రిమాండ్ డైరీ మాత్రమే గౌరవ న్యాయ స్థానం పరిశీలనకు తీసుకుంటుంది.

అరెస్టు చేయడానికి పోలీసులు తన ఇంటికి వెళితే, ద్వారం మూసి వేసి సుమారు ఒక గంట వరకు కూడా తలుపులు తెరవకుండా మీడియా వారిని పిలుచుకొని ఆ తర్వాతనే ఆమె ద్వారం తీసి, మీడియా సమక్షంలో పోలీసులను అరెస్ట్ చేయుటకు అనుమతినిచ్చింది. పోలీసులు ఆమెను ఆఫీస్ లోకి వెళ్లి బలవంతంగా అరెస్టు చేసి తీసుకు వచ్చింది ఎక్కడా లేదు. అరెస్ట్ సమయంలో తన ఇంటిలో నుండి బయటికి వచ్చిన శ్రీమతి బోడిగే శోభ గారు కొన్ని టీవీ చానెల్లకు ఇంటర్వ్యూ కూడా ఇవ్వడం జరిగింది .

ఇక మూడవ ఆరోపణ లో తనను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు వాహనంలో తీసుకుపోయే సమయంలో తన వాహనం లో మహిళా పోలీస్ లు వున్నారని, మధ్యలో కోతీరాంపుర్ వద్ద తాను వున్న వాహనాన్ని ఆపి అందులోకి ఏ సి పి, సి ఐ. నటేశ్, లక్షీబాబు, మరియు దామోదర్ రెడ్డి లు వాహనంలో ఎక్కి, శ్రీ బండి సంజయ్ కుమార్ గారిపై మరియు శ్రీమతి బోడిగ శోభ గారిపై రకరకాల కేసులు పెడ్డతామని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే మిమ్మల్ని అంతు చూస్తామని బెదిరించినట్లు ఆరోపించారు. ఇది వినడానికి కూడా హాస్యాస్పదం గానే ఉన్నది.

ఇక చివరగా తాను జైల్లో ఉన్నప్పుడు ప్రతి రోజు సీపీ గారు ఏసీపీ కరీంనగర్, ఇన్స్పెక్టర్ టూ టౌన్, మరియు త్రీ టౌన్ లు ప్రతి రోజు జైలుకి వచ్చారని ఆరోపించడం. జైలుకు కొన్ని నిబంధనలు దాని పర్యవేక్షణకు ఉన్నతాధికారులు ఉంటారు అనే విషయం శ్రీమతి బొడిగ శోభ గారికి తెలియకపోవడం దురదృష్టకరం. అందులో ఎవరు ప్రవేశించాలన్న ఉన్నతాధికారుల నుంచి అనుమతి పొందకుండా వెళ్ళడానికి వీల్లేదు. అంతేకాకుండా ప్రతిక్షణం సీసీ కెమెరాల పరిరక్షణలో వున్న జైలును ఉన్నతాధికారులు కూడా పర్యవేక్షిస్తూ ఉంటారు. అనధికారికంగా ఎవరు ప్రవేశించే అవకాశమే లేదు. అందులో వున్న సీసీ కేమెరాల్లో నిక్షిప్తమవుతుంది. జైలు అధికారులు వారి ఉన్నతాధికారులకు సంజాయిషీ ఇచ్చుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఇటువంటి నిరాధారమైన ఆరోపణలు ప్రజలను తప్పుదోవ పట్టించడానికి, తమ ప్రచారం కోసం పనికి వస్తుంది, కానీ విజ్ఞులు ఎవరు కూడా ఇటువంటి ఆరోపణలు విశ్వసించరని తెలియజేస్తున్నాము.

శాంతిభద్రతల పరిరక్షణ లో పోలీసు శాఖ ప్రజల సహకారంతో ముందుకు వెళుతూ, పోలీసు శాఖ ప్రతిష్టను ఇనుమడింప జేసేలా పని చేస్తున్నారని , ఈ క్రమంలో పోలీసు శాఖను నిందించడం సరైంది కాదని, ఇప్పటికైనా పోలీసులపై నిరాధారమైన అహెతుకమైన ఆరోపణలు మానుకోవాలని తెలియజేస్తున్నాము.

Get real time updates directly on you device, subscribe now.

You might also like
error: Content is protected !!
Karimnagar News page contents