టిఆర్ఎస్వి క్యాలెండర్ ఆవిష్కరించిన జెడ్పీ చైర్ పర్సన్
తెలంగాణ జాగృతి యువజన విభాగం మెడిపెల్లి ఆధ్వర్యంలో రూపొందించిన క్యాలెండర్ ను జగిత్యాల జిల్లా జెడ్పి చైర్ పర్సన్ దావ వసంత సురేష్ జగిత్యాల జిల్లా కేంద్రంలోని జెడ్పీ క్యాంపు కార్యాలయంలో శనివారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మేడిపల్లి మండలం జాగృతి కన్వీనర్ బూసి రాకేష్, ఉపాధ్యక్షులు కొంక గంగరాజం, జాగృతి సీనియర్ నాయకులు కడతల వెంకటేష్, ఇడుగునూరి హరీష్, వేముల రాజేష్, ఎం డి అస్లాం, జాగృతి యువ కన్వీనర్లు పాల్గొన్నారు.