భార్య స్నానం చేస్తుండగా..అతడు చేసిన దరిద్రపు పనికి షాక్

0 7

ఓ జంట గొడవ పెట్టుకొని చివరకు బ్లాక్ మెయిల్ దాకా వెళ్లింది. పోలీసుల కథనం మేరకు.. మహారాష్ట్రలోని బివండికి చెందిన ఓ వ్యక్తికి అదే గ్రామానికి చెందిన 28 సంవత్సరాల మహిళతో 2015లో వివాహం జరిగింది. అప్పుడు కట్నకానుకల కింద అతడికి దాదాపు రూ.12 లక్షలు ముట్టజెప్పారు. అంతే కాదు అమ్మాయికి రూ. 5లక్షల బంగారం కూడా ఇచ్చారు. ఇవన్నీ ఇచ్చినా అతడికి వరకట్న దాహం మాత్రం తీరలేదు. ఇంకా అతనపు కట్నం కావాలని భార్యను వేధించం మొదలు పెట్టాడు. ఓ రోజు అతడి వేధింపులకు భరించలేక ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. తర్వాత బతిమిలాడటంతో ఇంటికి వచ్చింది. మళ్లీ కొన్నాళ్లకు ఇలా ప్లాట్ తీసుకోవాలని.. దానికి పుట్టింటినుంచి డబ్బులు కావాలని డిమాండ్ చేశాడు. ఇలా ఆమె పలుమార్లు పుట్టింటికి వెళ్లడం .. మళ్లీ రావడం జరుగుతోంది. ఈ సారి ఫుల్ తాగి వచ్చి డబ్బులు కావాలని అడగడంతో ఇంటికి వెళ్లింది. అంతే కాదు అతడిపై వరకట్న వేధింపుల కింద కేసు కూడా పెట్టింది. ఎట్టకేలకు భర్త బుజ్జగించడంతో భార్య కేసును వాపసు తీసుకున్నది.

భార్య స్నానం చేస్తుండగా..అతడు చేసిన దరిద్రపు పనికి షాక్

కానీ ఈ సారి అతడు వక్రబుద్ధిని చూపించాడు. థానేలో నివాసం ఉంటూ కూలీ పనులు చేసుకుంటుండగా ఓ రోజు అతడు భార్య స్నానం చేస్తుండగా వీడియో చిత్రీకరణ చేశాడు. దీనిని అడ్డం పెట్టుకొని అతడు ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించాడు. ఈ వేధింపులు తట్టుకోలేక పుట్టింటికి వెళ్లింది. ఇంటికి తిరిగి రాకపోతే వీడియోను సామాజిక మాధ్యమాల్లో పెడుతానని భార్యను భర్త బెదిరించాడు. కానీ చివరకు అతడు అనుకున్నదే చేసేశాడు. భార్య స్నానం చేస్తున్న వీడియోను అతడు తన వాట్సాప్ స్టేటస్ లో పెట్టాడు. ఇది చూసిన సదరు భార్య వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతడిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. అతడిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి.

Get real time updates directly on you device, subscribe now.

You might also like
error: Content is protected !!
Karimnagar News page contents