అభివృద్ధి పనులకు నగర వాసులు సహకరించాలి: మేయర్
కరీంనగర్ నగర అభివృద్ధి ధ్యేయంగా పట్టణంలో అభివృద్ధి పనులను త్వరిత గతిన పూర్తి చేస్తున్నామని అభివృద్ధి పనులకు నగర వాసులు సహకరించాలని నగర పాలక మేయర్ సునీల్ రావు అన్నారు. కరీంనగర్లోని 33వ డివిజన్ లో డ్రైనేజ్ పనులకు సునీల్ రావు సోమవారం భూమి పూజ చేశారు. గత పాలకులు అభివృద్ధిని పట్టించుకోలేదని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోతుంది. కరీంనగర్ ను తెలంగాణ చిత్రపటంలో రెండో స్థానంలో ఉంచాలనే తెరాస ప్రజాప్రతినిధుల ఆకాంక్ష ఆయన అన్నారు.