వ్యవసాయ శాఖ మంత్రికి ఫోన్ చేసిన శ్రీధర్ బాబు..
అకాల వర్షాలతో నష్టపోయిన మిర్చి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని మంథని ఎమ్మేల్యే శ్రీధర్ బాబు.. వ్యవసాయ శాఖ మంత్రి నీరంజన్ రెడ్డికి ఫోన్ ద్వారా విజ్ఞప్తి చేశారు. మాదాపూర్ మండలంలోని నష్టపోయిన మిర్చి పంటలను పరిశీలించారు. అనంతరం ఆయన పంట చేనులో ఉండి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నీరంజన్ రెడ్డితో తో ఫోన్ లో మాట్లాడి మిర్చి రైతులను, కౌలు రైతులను ఆదుకోవాలని కోరారు. మాహాదేవపూర్, ముత్తరాం, మల్హర్ మండలంలో మిర్చి రైతుల సమస్యలను మంత్రికి ఫోన్ ద్వారా తెలియజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అకాల వర్షాలతో నష్టపోయిన మిర్చి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని, పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకొని వెంటనే నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఆయన వెంట గుడాల రుణ, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు కోట రాజనాపు, నాయకులు, రైతులు ఉన్నారు. అకాల వర్షాలతో నష్టపోయిన మిర్చి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని మంథని ఎమ్మేల్యే శ్రీధర్ బాబు.. వ్యవసాయ శాఖ మంత్రి నీరంజన్ రెడ్డికి ఫోన్ ద్వారా విజ్ఞప్తి చేశారు. మాదాపూర్ మండలంలోని నష్టపోయిన మిర్చి పంటలను పరిశీలించారు. అనంతరం ఆయన పంట చేనులో ఉండి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నీరంజన్ రెడ్డితో తో ఫోన్ లో మాట్లాడి మిర్చి రైతులను, కౌలు రైతులను ఆదుకోవాలని కోరారు. మాహాదేవపూర్, ముత్తరాం, మల్హర్ మండలంలో మిర్చి రైతుల సమస్యలను మంత్రికి ఫోన్ ద్వారా తెలియజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అకాల వర్షాలతో నష్టపోయిన మిర్చి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని, పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకొని వెంటనే నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఆయన వెంట గుడాల రుణ, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు కోట రాజనాపు, నాయకులు, రైతులు ఉన్నారు.