కరోనా భయంతో లగ్గాలు వాయిదా వేసుకుంటున్న జనం

0 19

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో లగ్గాలు చేసుకునేటోళ్లకు, వాళ్ల పేరెంట్స్ కు కరోనా గుబులు పట్టుకుంది. రోజురోజుకు కేసులు పెరుగుతుండడంతో అందరిలో టెన్షన్ మొదలైంది. ఇప్పటికే బడులకు సంక్రాంతి సెలవులను ముందే ప్రకటించిన ప్రభుత్వం.. వాటిని ఈనెల 30 దాకా పొడిగించింది. కరోనా కట్టడికి మరిన్ని ఆంక్షలు విధించే అవకాశం కనిపిస్తోంది. దీంతో చాలా మంది లగ్గాలు వాయిదా వేసుకుంటున్నారు. ఇప్పటికే ఇచ్చిన ఆర్డర్లను క్యాన్సిల్ చేసుకుంటున్నారు. ఈసారి పెండ్లిళ్లు పెద్ద ఎత్తున ఉండడంతో చాలామంది ఫంక్షన్ హాల్స్, డెకరేషన్, క్యాటరింగ్ తదితర అడ్వాన్స్ బుకింగ్ చేసుకోగా.. ఇప్పుడవన్నీ రద్దు చేసుకుంటున్నారు. అయితే కొంతమంది మాత్రం వేచి చూసే ధోరణిలో ఉన్నారు. మళ్లీ ముహూర్తం కుదరకపోతే ఎట్లా? అని, ఎలాగోలా ఇప్పుడే చేసేయాలని భావిస్తున్నారు. 

Also Read :


12 రోజులు ముహూర్తాలు..
ప్రస్తుతం పుష్య మాసం నడుస్తోంది. వచ్చే నెల 2 నుంచి మాఘ మాసం మొదలవుతుంది. మాఘ మాసంలో మస్తు పెండ్లిళ్లు జరుగుతాయి. ఫిబ్రవరి 2 నుంచి 18 వరకు ముహూర్తాలు ఉన్నాయి. ఆ నెల 2, 3, 4 , 5, 6, 10, 11, 12, 13, 16, 17, 18 తేదీల్లో లగ్గాలు ఉన్నాయి. ఈ రోజుల్లో దాదాపు 50 వేలకు పైగా పెండ్లీలు ఉన్నట్లు పూజారులు చెప్పారు. ఇవి దాటిపోతే మళ్లీ మార్చి 18 నుంచి 28 మధ్య మాత్రమే ముహూర్తాలు ఉన్నాయని తెలిపారు. ఆ తర్వాత ఉగాది, శ్రీరామనవమి పండుగలయ్యాకే ముహూర్తాలు ఉంటాయని, అంటే నెలన్నర దాకా లగ్గాలు ఉండవని పేర్కొన్నారు. 

వచ్చే నెల మాఘ మాసం కావడంతో 2 వ తేదీ నుంచి 18 వరకు ముహూర్తాలు ఉన్నాయి. దాదాపు 50 వేలకు పైగా మంది లగ్గాలు పెట్టుకున్నారు. అయితే కరోనా కేసులు పెరుగుతుండటంతో అందరూ డైలమాలో పడ్డారు. ఆంక్షలు పెడితే లగ్గాలు వాయిదా వేసుకుంటామని కొందరు అంటున్నారు. మరికొందరు వేచి చూస్తున్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like
error: Content is protected !!
Karimnagar News page contents