గుట్కా నిలువలపై పోలీసుల దాడులు
జగిత్యాల జిల్లాలోని పలు ప్రాంతాల్లో గుట్కా నిలువల పై పోలీసులు సోమవారం ఏకకాలంలో దాడులు నిర్వహించారు. మెట్పల్లి పోలీస్ సర్కిల్ పరిధిలో గుట్కా రవాణా చేస్తూ విక్రయిస్తున్న వ్యక్తులపై దాడి చేసి వారి వద్ద రూ. 1, 50, 000 విలువగల గుట్కా స్వాధీనం చేసుకున్నారు.
కోరుట్లలో గుట్కా స్థావరాలపై పోలీసులు దాడి చేసి రూ. 6 లక్షల 37 వేల 760 విలువగల గుట్కా ప్యాకెట్లు స్వాధీనం చేసుకుని నలుగురు వ్యక్తులపై కేసు నమోదు చేశారు. ధర్మపురి లో రూ 40 వేల విలువ గల గుట్కా ప్యాకెట్లు పట్టుకున్నారు