దారుణం…చెల్లి మృతదేహంతో 4 రోజులు గడిపిన అక్క
పెద్దపల్లి జిల్లా కేంద్రంలో దారుణం చోటుచేసుకుంది. చనిపోయిన చెల్లితో 4 రోజులు పాటు కలిసి ఉన్న అక్క. ఆలస్యంగా ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే… పెద్దపల్లి ప్రగతినగర్ లో ఇద్దరు అక్కాచెల్లెళ్లు అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు. శ్వేత (24) చెల్లెలు అనారోగ్యంతో చనిపోగా, మృతదేహంతో గత నాలుగు రోజులుగా అక్క స్వాతి కలిసి ఉంది. దురువాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పెద్దపల్లి పోలీసులు ఈ ఘటనపై విచారణ చేపట్టారు. శ్వేత ఎలా మృతి చెందిందనే విషయం తెలియాల్సి ఉంది.