విద్యా సంస్థలను ప్రారంభించాలి: ఎస్ఎఫ్ఐ
కోవిడ్ నిబంధనలను పాటిస్తూ విద్యాసంస్థలను భౌతికంగా ప్రారంభించాలని ఎస్ఎఫ్ఐ కరీంనగర్ జిల్లా కార్యదర్శి శనిగరపు రజినీకాంత్ డిమాండ్ చేశారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ జనవరి 30 వరకు సెలవులు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడాన్ని ఎస్ఎఫ్ఐ పూర్తిగా వ్యతిరేకిస్తోందన్నారు. కరోనా నిబంధనలు పాటిస్తూ విద్యాసంస్థలను భౌతికంగా ప్రారంభించాలని, తక్షణమే జీవో నెంబర్ 4 ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.