టీఆర్ఎస్ నాయకుల ముందస్తు అరెస్ట్
ఇబ్రహీంపట్నం మండలంలోని అన్ని గ్రామాలలోనీ టీఆర్ఎస్ నాయకులను ఈ రోజు తెల్లవారు జామున పోలీసులు అరెస్టు చేశారు. వారందరినీ ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ కు తరలించారు. నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ఎంపీ అరవింద్ ఇబ్రహీంపట్నం మండలం లోని తన దత్తత తీసుకున్న మూలరాంపూర్, గోదురు గ్రామాలలో ఇవాళ పర్యటించనున్నారు.
ఈ సందర్భంగా పలు కార్యక్రమాలలో పాల్గొంటారని, అందుకే ఏలాంటి గొడవలు, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా టీఆర్ఎస్ నాయకులను అరెస్టు చేసి, స్టేషన్ కు తరలించినట్టు ఎస్ఐ ఉమా సాగర్ తెలిపారు ఈ సందర్భంగా టీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ.. అబద్ధాల అరవింద్ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. అరెస్టు చేసిన నాయకులలో జెడి సుమన్ దేశెట్టి రాజారెడ్డి, సున్నం సత్యం రాపెళ్లి సురేష్, నేమరి సత్యనారాయణ పలు గ్రామాల టీఆర్ఎస్ నాయకులు ఉన్నారు