ప్రతి ఒక్కరూ కరోనా నిబంధనలు పాటించని : రుద్రంగి ఎస్సై విజయ్ కుమార్
కరోనా థర్డ్ వే సందర్భంగా అందరూ మాస్క్ ధరించాలి అని రుద్రంగి మండల ప్రజలకు ఎస్సై విజయ్ కుమార్ విజ్ఞప్తి చేశారు. మాస్క్ ధరించకపోతే వేయి రూపాయల జరినామా విధిస్తామనిఅన్నారు. త్రిబుల్ రైడింగ్ చేయరాదని, 18 సంవత్సరాల లోపు వయసు వారు వాహనం గాని బైక్ గాని నడిపితే శిక్షార్హులు అని, పిల్లల తల్లిదండ్రులకు మరియు వేకిల్ ఓనర్లు కూడా శిక్షార్హులు అవుతారని తెలియజేశారు. గంజాయి మీద ప్రత్యేక దృష్టి పెట్టామని గంజాయి ద్వారా యూత్ చాలా చెడి పోతున్నారని, యూత్ వారి భవిష్యత్తు దేశానికి చాలా ముఖ్యమని గంజాయి అమ్మిన వారిపై శిక్షలు కఠినంగా ఉంటాయని రుద్రంగి మండల ఎస్సై విజయ్ కుమార్ తెలియజేశారు.