కోవిడ్ నియంత్రణకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలి: విసి లో మంత్రి కొప్పుల

0 10

కోవిడ్ నియంత్రణకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర సంక్షేమ శాఖా మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. బుధవారం మంత్రి జూమ్ వీడియో సమావేశం ద్వారా రెండవ డోస్ వాక్సినేషన్, కొవిడ్ కట్టడిపై తీసుకుంటున్న చర్యలపై జగిత్యాల జిల్లా కలెక్టర్ జి. రవి, పెద్దపల్లి జిల్లా కలెక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ, రెండు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, రెండు జిల్లాల ప్రజా ప్రతినిధులతో సమీక్షించారు.
కోవిడ్ నియంత్రణకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలి: విసి లో మంత్రి కొప్పుల
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, కేబినెట్ సమావేశంలో ముఖ్యమంత్రి జిల్లాల్లో 100% వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని సూచించారని తెలిపారు. జిల్లాలో మండలాల వారీగా వాక్సినేషన్ ప్రగతిని సమీక్షించి, తక్కువ వాక్సినేషన్ నమోదు అయిన మండలాల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని మంత్రి సూచించారు. వ్యాక్సినేషన్ అంశంపై జిల్లాలో టాస్క్ ఫోర్స్ అధికారుల టీమ్ ను ఏర్పాటు చేసి ప్రత్యేక కార్యాచరణను రూపొందించుకొని వాక్సినేషన్ పురోగతిపై చర్యలు తీసుకోవాలన్నారు.

జగిత్యాల జిల్లా పరిధిలో ధర్మపురి, మల్యాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో తక్కువ శాతం వాక్సినేషన్ నమోదు అయిందని వీటిపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని మంత్రి సూచించారు. ప్రపంచ వ్యాప్తంగా ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి అధికంగా జరుగుతుందని, మన జిల్లాలో ఒమిక్రాన్ ఎక్కువగా ప్రబలకుండా కోవిడ్ జాగ్రత్తలు తీసుకోవాలని, మెడికల్ అధికారులతో కొవిడ్ ముందస్తు ఏర్పాట్లు పై సమీక్షించుకుని అన్ని ఏర్పాట్లను చేయాలన్నారు. జిల్లాలో అందుబాటులో ఉన్న మందుల వివరాలు, హోం ఐసొలేషన్ కిట్స్ వివరాలు కలెక్టర్లు పరిశీలించాలని, అవసరమైన మేర ఆర్డర్ చేయాలని మంత్రి తెలిపారు.

వ్యాక్సినేషన్ తీసుకోవడానికి వెనకాడుతున్న ప్రజలకు వ్యాక్సిన్ ఆవశ్యకతపై ప్రజాప్రతినిధులు అవగాహన కల్పించాలని మంత్రి సూచించారు. కరోనా వ్యాక్సినేషన్ అంశంపై రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రతిరోజు రెగ్యులర్ మోనిటరింగ్ చేస్తున్నారని, అన్ని ప్రభుత్వ కార్యక్రమాల్లో ముందు ఉన్న జగిత్యాల, పెద్దపల్లి జిల్లాలో కోవిడ్ వ్యాక్సినేషన్ లో సైతం ప్రథమ స్థానంలో నిలవాలని మంత్రి పిలుపునిచ్చారు.

వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ జి. రవి మాట్లాడుతూ, 7, 58, 757 జనాభా లక్ష్యానికి గాను 100% మొదటి డోస్, 75% రెండవ డోస్ పూర్తి చేయడం జరిగిందని అన్నారు. జిల్లాలో 51979 మంది రెండవ డోస్ పెండింగ్ ఉందని, పండుగల సందర్భంగా వాక్సినేషన్ తక్కువగా నమోదు అయిందని, మొదటి డోస్ తీసుకొని రెండవ డోస్ వేసుకోని వారిని గుర్తించి రెండవ డోస్ సరైన సమయంలో తీసుకునే విధంగా చర్యలు తీసుకున్నామని తెలిపారు.

జిల్లాలో 15-17 వయస్సు గల వారికి 46 శాతం వాక్సిన్ వేయడం జరిగిందని, ప్రతి రోజూ గ్రామాల్లో ఉన్న ఏఎన్ఎంలు, మహిళా సంఘాలు అంగన్వాడీ టీచర్లు, ఇతర సిబ్బందితో ప్రత్యేక బృందాలుగా ఏర్పాటు చేసి ఇంటింట ఫీవర్ సర్వే నిర్వహించి వ్యాక్సిన్ వేసుకునే వారిని గుర్తించి వ్యాక్సిన్ అందించే విధంగా అవగాహన కల్పింస్తున్నామని, కొవిడ్ ను నియంత్రణలో ఉంచే విధంగా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ తెలిపారు.

ఈ వీడియో సమావేశంలో జడ్పీ చైర్మన్ దావవసంత జగిత్యాల, చొప్పదండి ఎమ్మెల్యేలు డాక్టర్ సంజయ్ కుమార్, సుంకె రవిశంకర్, జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ పి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like
error: Content is protected !!
Karimnagar News page contents