ప్రజా ప్రతినిధుల దృష్టికి న్యాయవాదుల సమస్యలు
కరీంనగర్ జిల్లా న్యాయవాదుల సమస్యల ను తెలంగాణ ప్రణాళిక సంగం ఉపాధ్యక్షుడు బి. వినోద్ కుమార్, మంత్రి గంగుల కమలాకర్ దృష్టికి తీసుకొని వెళ్లినట్లు కరీంనగర్ బార్ అస్సోసి యేషన్ మాజీ అధ్యక్షులు, రాష్ట్ర న్యాయవాదుల సంక్షేమ ట్రస్టు సలహామండలి సభ్యులు పి వి రాజ్ కుమార్ తెలిపారు. ఈసందర్బంగా బుధవారం హైద్రాబాద్ లోని అధికారిక కార్యాలయాల్లో వారినికలిసి చర్చించినట్లు అయన తెలిపారు. తెలంగాన ఉద్యమంలో పాల్గొన్న న్యాయవాదులను గుర్తించివారికి సముచిత ప్రాధాన్యత కలిపించా లని కోరగా పరిశీలిస్తామని తెలిపారు. త్వరలో జిల్లాకేంద్రంలో న్యాయవాదులతో సమావేశం ఏర్పాటు చేసి అన్నింటి పై వివరంగా చర్చిస్తామని మంత్రి కమలాకర్, మాజీ ఎంపీ వినోద్ కుమార్ లు హామీఇచ్చినట్లు, ఫిబ్రవరి నెలలో న్యాయవాదులతో కరీంనగర్ పట్టణములో సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు రాజ్ కుమార్ తెలిపారు. రాజకుమార్ తో పాటు గడ్డం లక్ష్మణ్, గౌరు రాజి రెడ్డి లు కలిసిన వారిలో వున్నారు.