మెడికల్ కళాశాల ఏర్పాటు కార్మికుల విజయం: రాజ్ ఠాకూర్
రామగుండం కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బొంతల రాజేష్ ఆధ్వర్యంలో బుధవారం 5ఇంక్లైన్ చౌరస్తా లోని కార్మికుని విగ్రహానికి రాజ్ ఠాకూర్ పూలమాలలు వేసి పాలాభిషేకం చేసి మాట్లాడుతూ, తమ రక్తాన్ని చెమట గా మార్చి మెడికల్ కళాశాల ఏర్పాటు లో కీలక పాత్ర పోషించిన కార్మికులకు కృతజ్ఞతలు తెలియచేసారు. అలాగే ఇక్కడి స్థానికులకు 30శాతం ఉద్యోగ అవకాశాలు కల్పించాలని అలాగే మెడికల్ కళాశాలకు కూడా సింగరేణి క మెడికల్ కళాశాల అని నామకరణం చేయాలనీ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాదర బోయిన రవికుమార్, కార్పొరేటర్లు మహంకాళి స్వామి, ఎండి ముస్తఫా, గాదం విజయానంద్, ముదాం శ్రీనివాస్, పెద్దెల్లి తేజస్విని ప్రకాష్, గట్ల రమేష్, తాటిపల్లి యుగేందర్, ఖాజా నజీముద్దీన్, ధనుంజయ్, కుంట సదానందం, వాజిద్ బేగం, బుర్ర వెంకన్న, గడ్డం శేఖర్, స్వప్న, ధూళికట్ట సతీష్, సిరిపురం మహేష్, రాపల్లి కార్తీక్, పీక శివకుమార్, తదితరులు పాల్గోన్నారు.