అక్రమ వడ్డీ వ్యాపారి ఇంటిపై టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడులు
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే ఐపీఎస్ ఆదేశాల మేరకు జిల్లా పరిధిలోని గంభీరావుపేట్ లో అక్రమ అధిక వడ్డీ వ్యాపారం చేస్తునడని నమ్మదగిన సమాచారం మేరకు జిల్లా టాస్క్ఫోర్స్ ఎస్. ఐ శ్రీనివాస్ తన సిబ్బందితో శ్రీగాధ గణేష్ ఇంట్లో బుధవారం పోలీసులు దాడులు జరిపి సోదాలు చేసి అతని వద్ద నుండి ప్రాంసరి నోట్స్, వాహనాలు, పాస్ బుక్స్ బంగారం స్వాధీనం చేసుకోవడం జరిగింది.
మొత్తం స్వాధీనపరుచుకున్న వాటి వివరములు:
1. 82 ప్రాంసరి నోట్స్ వాటి విలువ 24, 70, 000/-రూపాయలు
2. స్వాధీనపరుచుకున్న నగదు సుమారు: 5, 47, 000/- రూపాయలు
3. రెండు పాస్ బుక్స్
4. రెండు గ్రాముల బంగారం
5. ఒక ద్విచక్ర వాహనం
పై వాటిని స్వాధీనపచుకుని చట్టపరమైన చర్యల నిమిత్తం గంభీరావుపేట్ పోలీస్ స్టేషన్ కు అప్పగించినైనది. జిల్లాలో దాడులు యధాతథంగా కొనసాగుతూనే ఉంటాయి, కాబట్టి ఇకనైనా అక్రమ వడ్డీ వ్యాపారులు, చిట్ ఫండ్ వ్యాపారులు తమ పద్దతి మార్చుకోకపోతే చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోబడుతాయని జిల్లా ఎస్పీ శ్రీ రాహుల్ హెగ్డే హెచ్చరించారు. అప్పు తీసుకోవడం, ఇవ్వడం నేరం కాదు కానీ ఆర్ బి ఐ నియమనిబందనలు, తెలంగాణా మని లెండింగ్ చట్టంలోని నిబందనల ప్రకారం చట్ట బద్దంగా ఎవరైనా లైసెన్స్ తొ అప్పులు ఇవ్వవచ్చు, తీసుకోవచ్చు. కాని చట్ట విరుద్ధంగా, అధిక వడ్డీ రేట్లతో సామాన్యుల పై దౌర్జన్యం చేస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ హెచ్చరించారు. ఈ టాస్క్ లో టాస్క్ఫోర్స్ ఎస్. ఐ శ్రీనివాస్ రాజేష్, రమేష్, అక్షర్, తిరుపతి, శ్రీనివాస్ పాల్గొన్నారు.