ఇన్సూరెన్స్ చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే

0 16

వివిధ సందర్భాల్లో ప్రమాదవశాత్తూ మృతి చెందిన టీఆరెస్ పార్టీ కార్యకర్తలు, పార్టీ సభ్యుల కుటుంబాలకు హుస్నాబాద్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ బుధవారం ఒక్కొక్కరికి రూ 2 లక్షల టీఆరెస్ పార్టీ ఇన్సూరెన్సు చెక్కులకు అందజేశారు.
ఇన్సూరెన్స్ చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే
ఎల్కతుర్తి మండలం కోతుల నడుమ గ్రామానికి చెందిన టీఆరెస్ పార్టీ కార్యకర్త సింగిరెడ్డి భాస్కర్ రెడ్డి మృతి చెందిన అయన సతీమణి జ్యోతికి రూ. 2 లక్షల ఇన్సూరెన్సు చెక్కు ఎమ్మెల్యే సతీష్ కుమార్ అందజేశారు. అలాగే ఎల్కతుర్తికి చెందిన గడ్డం ఐలయ్య మృతి చెందగా ఆయన భార్య లలితకు, హుస్నాబాద్ మండలం బల్లునాయక్ తండాకు చెందిన లావుడ్య భీమా మృతి చెందగా అయన భార్య కాంసి కి, పోతారం ఎస్ గ్రామానికి చెందిన బత్తిని వెంకటేశ్వర్లు మృతి చెందగా అయన భార్య లక్ష్మి కి, చిగురుమామిడి మండలం ఇందుర్తి గ్రామానికి చెందిన సందవేని కొమురయ్య మృతి చెందగా అయన భార్య లక్షమ్మకు, సీతారాంపూర్ గ్రామానికి చెందిన ఒంటెల రాజిరెడ్డి మృతి చెందగా ఆయన సతీమణి రజనికి, సైదాపూర్ మండలం జాగీర్పల్లి గ్రామానికి చెందిన దొడ్డి రాజయ్య మృతి చెందగా అయన భార్య లక్ష్మికి, హుస్నాబాద్ పట్టణానికి చెందిన పెట్టుగడి విజయ మృతిచెందగా ఆమె కుమార్తె సాయి లక్ష్మికి రూ. 2 లక్షల ఇన్సూరెన్సు చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like
error: Content is protected !!
Karimnagar News page contents