సిమ్ కార్డుకు సంబంధించి సరికొత్త రూల్స్ ను తీసుకొచ్చిన కేంద్రం..!

0 6

కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు సిమ్ కార్డు రూల్స్‌ గురించి వివరాలను సవరించింది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వలన విదేశాలకు వెళ్లే భారతీయులకు ఇక మీదట ఊరట కలుగనున్నుట్లు తెలుస్తుంది. ఇంటర్నేషనల్ రోమింగ్ సిమ్ కార్డు నిబంధలను సవరించినట్లు డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలీ కమ్యూనికేషన్స్ తాజాగా ఒక ప్రకటనలో తెలిపింది. ఇకమీదట విదేశాలకు వెళ్లే వాళ్ళు ఇంటర్నేషనల్ రోమింగ్ సిమ్ కార్డుల అమ్మకాలకు సంబంధించిన నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ రూల్స్ ను సవరించింది.

ఇకమీదట విదేశాలకు వెళ్లే భారతీయులకు ఎక్కువ ప్రయోజనం తెలుసా..?

ఈ సందర్బంగా డాట్ తమ కస్టమర్లకు మెరుగైన సేవలు, అధిక భద్రతను లక్ష్యంగా చేసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. డాట్ తీసుకున్న ఈ నిర్ణయం వలన విదేశాలకు వెళ్లే భారతీయులకు ఎక్కువ ప్రయోజనం కలగనుందని తెలుస్తుంది. ఈ నిబంధనల ప్రకారం ఎన్ఓసీ హోల్డర్లు కస్టమర్ సర్వీస్, కాంటాక్ట్ డీటైటల్స్, ప్లాన్స్ ధరలు, సర్వీసులు వంటి వివరాలను అన్నింటినీ కస్టమర్లకు తెలపాలిసి ఉంటుంది. అంతర్జాతీయ సిమ్ కార్డుల విక్రయం, రెంట్‌కు తీసుకోవడం, భారత్‌లో ఫారిన్ ఆపరేట్ల గ్లోబల్ కాలింగ్ కార్డ్స్ అనే అంశానికి సంబంధించి టెలికామ్ రెగ్యులేటర్ ట్రాయ్ సిఫార్సుల మేరకు డాట్ తాజాగా రూల్స్‌ను సవరించింది.

యూజర్లును పెంచుకుంటూపోతున్న జియో:

మన దేశంలో ఎక్కువ మంది జియో, ఎయిర్టెల్, వోడా ఐడియా నెట్ వర్క్స్ ను విరివిగా ఉపయోగిస్తున్నారు. ఇప్పటి వరకు దేశంలో 2021 నవంబర్ నాటికి మొబైల్ సబ్‌స్క్రైబర్ల సంఖ్య అత్యధికంగా 119 కోట్లకు చేరింది. గత సంవత్సరం నవంబర్ నెలలో ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ జియో యూజర్ల సంఖ్య 2 మిలియన్లకు పెరిగింది. జియో యూజర్ల సంఖ్య పెరుగుతూ రావడం వరుసగా ఇది రెండో నెల అవ్వడం విశేషం అనే చెప్పాలి.

ఎయిర్టెల్ మాట ఒకేగాని… మరి వోడాఫోన్ ఐడియా సంగతి ఏంటో..?

ప్రస్తుతం జియో యూజర్ల విషయానికి వస్తే మొత్తంగా 42.8 కోట్లకు చేరింది. ఇకపోతే భారత్ ఎయిర్‌టెల్ యూజర్ల సంఖ్య 1.3 మిలియన్లకి చేరింది. ఇప్పుడు ఎయిర్‌టెల్ యూజర్ల సంఖ్య ప్రస్తుతానికి 35.5 కోట్లుగా ఉంది. కానీ వొడాఫోన్ ఐడియా యూజర్ల సంఖ్య మాత్రం క్రమంగా తగ్గుతూ వస్తుంది.అంటే 1.8మిలియన్ల మంది యూజర్లకు క్షీణించింది. ఈ సంస్థకు మొత్తంగా 26.71 కోట్ల మంది యూజర్లు ఉండగా ఇప్పుడు ఈ కంపెనీ యూజర్ల సంఖ్య క్రమంగా తగ్గుతూనే వస్తున్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like
error: Content is protected !!
Karimnagar News page contents