భర్త తల నరికి పోలీస్ స్టేషన్ కి వెళ్ళిన మహిళ

0 18

భార్యభర్తల బంధం అంటే నమ్మకంపై నిలబడుతుంది. ఒకరిపై ఒకరికి నమ్మకం ఉంటేనే ఆ జీవితం సాఫీగా సాగుతుంది.

అలా కాదని ఒక్కరు తప్పుడుదారిలో వెళ్లినా ఆ బంధం విచ్చిన్నమవుతుంది. భర్తపై భార్యకు.. భార్యపై భర్తకు ఎనలేని నమ్మకం ఉంటుంది. అలాంటి నమ్మకం వమ్మైతే మాత్రం తట్టుకోలేరు. తాము ప్రేమించిన వారు వేరే వాళ్లతో సంబంధం పెట్టుకుంటే మాత్రం అప్పటివరకు ఉన్న ప్రేమ కాస్తా ఆగ్రహంతో కట్టలు తెచ్చుకుంటుంది. అలాంటి ఓ భార్య.. భర్త అక్రమ సంబంధాన్ని సహించలేకపోయింది. తానుండగా వేరే మహిళతో తిరుగుతున్నాడనే ఆగ్రహంతో ఏకంగా అతడి హత్య చేసి తలను తీసుకొని పోలిస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయింది. ఒళ్లు గగుడ్పొడిచే ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని చిత్తూరు జిల్లా (Chittoor District) లో చోటు చేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల మేరకు…. చిత్తూరు జిల్లా రేణిగుంట పట్టణంలో గత కొన్నేళ్లుగా రవిచంద్ సూరి(55)., వసుంధర (45) దంపతులు నివాసం ఉంటున్నారు. 30 ఏళ్లుగా సాఫీగా సాగుతున్న వీరి కాపురంలో వివాహేతర సంబంధం చిచ్చు రేపింది. ఈ వయసులో కూడా భర్త సూరి వేరే మహిళతో ఎఫైర్ పెట్టుకున్నాడు. ఈ క్రమంలో భార్యను నిర్లక్ష్యం చేయడం మొదలుపెట్టాడు. ఓ భర్త అక్రమ సంబంధాన్ని భార్య ప్రశ్నించింది.

దీంతో వారి మధ్య మొదలైన మాటల యుద్ధం కాస్తా దూషించుకునేవరకు వెళ్లింది. ఇంట్లో మతి స్థిమితం లేని కుమారుడ్ని కంటికి రెప్పలా కాపాడుకోవాల్సింది పోయి ఇలాంటి పనులేంటని నిలదీసింది. ఇలా మాట మాట పెరిగి గొడవ కాస్త శృతి మించడంతో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో భర్తపై కోపంతో ఊగిపోయిన భార్య వసుంధర ఒక్కసారిగా భర్త రవిచంద్ సూరి పై దాడి చేసింది.

తాను ఏం చేస్తున్నానో మరిచిపోయిన కత్తితో అత్యంత క్రూరంగా గొంతు కోసి తల మొండెంను వేరు చేసింది. కసితీరా చంపేశాక.. ఆ తలను తీసుకెళ్లి పోలీసులకు లొంగిపోయింది. మహిళ భర్త తలతో రావడం చూసి పోలీసులే షాకయ్యారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలంకు చేరుకొని దర్యాప్తు చేపట్టారు. అక్రమ సంభందమే హత్యకు కారణమైనట్లుపోలీసులు అనుమానిస్తున్నారు. అదుపులో ఉన్న భార్య వసుంధరను విచారణ చేస్తే మరిన్ని విషయాలు తెలుస్తాయని రేణిగుంట సర్కిల్ సిఐ అంజు యాదవ్ తెలిపారు.

వసుంధర భర్త తలను పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్తున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. ఈ ఘటనతో రేణిగుంట ఒక్కసారిగా ఉలిక్కిపయింది. ఐతే భర్తకు తగిన శాస్తి జరిగిందని కొందరంటుంటే.. భర్త చనిపోవడం, భార్య జైలు కెళ్లడంతో మతిస్థిమితం లేని వారి కుమారుడి భవిష్యత్తు ప్రశ్నార్ధకంగా మారింది.

Get real time updates directly on you device, subscribe now.

You might also like
error: Content is protected !!
Karimnagar News page contents