ఇసుక ట్రాక్టర్ ల పట్టివేత
కొత్తపల్లి మండలం బావుపేట వద్ద అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న రెండు ట్రాక్టర్లను పోలీసులు పట్టుకున్నారు. ఎస్సై ఎల్లాగౌడ్ తెలిపిన వివరాల ప్రకారం బోయినిపల్లి నుండి అక్రమంగా కరీంనగర్ కు ఇసుక రవాణా చేస్తుండగా బ్లూ కోట్ పోలీసులు పట్టుకుని పోలీస్స్టేషన్ కు తరలించగా కేసు నమోదు చేసినట్లు తెలిపారు.