పేకాట ఆడుతున్న నలుగురు పై కేసు నమోదు చేసిన ఎసై
రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం మర్లపేట శివారులో, నమ్మదగిన సమాచారం మేరకు పేకాట ఆడుతున్న నలుగురు వ్యక్తులైన జనార్ధన్ రెడ్డి, పొన్నం రాజు, పోరెడి ప్రతాప్ రెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటరెడ్డినీ పట్టుకొని వారివద్ద నుండి రూ 4800/- స్వాధీనం చేసుకొని పై నలుగురి పై, కేసు నమోదు చేసినట్లు ఎస్సై అభిలాష్ తెలిపారు. మండలంలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చట్ట రీత్యా చర్యలు తీసుకొని కేసు నమోదు చేయడం జరుగుతుంది ఎస్సై అభిలాష్ హెచ్చరించారు.