ఓటరు దినోత్సవంను ఘనంగా నిర్వహించాలి: కలెక్టర్
జనవరి 25న జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలలో జాతీయ ఓటరు దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని కరీంనగర్ జిల్లా కలెక్టర్ కర్ణన్ ఒక ప్రకటనలో తెలిపారు. జాతీయ ఓటరు దినోత్సవం సందర్బంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో, అధికారులు, ఉద్యోగులు, విద్యాసంస్థలలో విద్యార్థులతో ఓటరు ప్రతిజ్ఞ చేయించాలని ఆదేశించారు.