అయిదో పెళ్లి చేసుకున్న మహిళ.. భర్తతో కలిసి అతిథిగా మాజీ భర్త ఇంటికి వెళ్లింది.. ఆ తర్వాత..

0 4

ఆమెకు ఇప్పటికే నాలుగు పెళ్లిళ్లు జరిగాయనీ.. ఓ కుమారుడు కూడా ఉన్నాడనీ తెలిసి అతడు ఆ మహిళను ఐదో పెళ్లి చేసుకున్నాడు.

అయిదో పెళ్లి చేసుకున్న మహిళ.. భర్తతో కలిసి అతిథిగా మాజీ భర్త ఇంటికి వెళ్లింది.. ఆ తర్వాత..

ఈ క్రమంలో పెళ్లైన కొద్ది రోజులకు భర్తతో కలిసి ఆ మహిళ మాజీ భార్త ఇంట్లో అడుగుపెట్టింది. అనంతరం భార్య నిజ స్వరూపాన్ని చూసి భర్త కంగుతిన్నాడు. కీలక నిర్ణయం తీసుకున్నాడు. అతడి నిర్ణయం కారణంగా మధ్యప్రదేశ్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. కాగా.. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..

జనవరి 12న ఇండోర్‌లోని ఓ ఇంట్లో తల్లికొడుకుల మృతదేహాలు లభ్యం కావడంతో మధ్యప్రదేశ్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ వార్త చర్చనీయాంశం అయింది. దీంతో పోలీసులు ఈ కేసును సీరియస్‌గా తీసుకున్నారు. హంతకుడిని అదుపులోకి తీసుకుని.. కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. అధికారులు చెప్పిన వివరాల ప్రకారం.. శారద అనే మహిళ ఇప్పటికే నలుగురుని పెళ్లి చేసుకుంది. ఈ క్రమంలోనే ఆమెకు ఓ బాబు కూడా జన్మించాడు. 11ఏళ్ల కొడుకు ఉండగానే.. తాజాగా కుల్దీప్ అనే వ్యక్తిని శారద ఐదో పెళ్లి చేసుకుంది. మహారాష్ట్రలో ఉంటోన్న ఈ దంపతుల మధ్య పెళ్లైన కొన్ని రోజులకే గొడవలు మొదలయ్యాయి. సరిగ్గా అప్పుడే ఆమె మొదటి భర్త మంగేశ్‌.. శారదను ఫోన్ ద్వారా కాంటాక్ట్ చేశాడు. మాజీ భార్య బాగోగులు తెలుసుకున్నాడు. గొడవల గురించి తెలుసుకుని ఆమెను ఓదార్చాడు. దీంతో శారద మళ్లీ మంగేశ్‌కు దగ్గరైంది. ఈ నేపథ్యంలోనే పని కోసం కుల్డీప్ జవనరి మొదటి వారంలో కుటుంబ సమేతంగా ఇండోర్ వెళ్లాడు.

ఈ విషయం తెలుసుకున్న మంగేశ్ భారీ స్కెచ్ వేశాడు. శారదకు మరింత దగ్గరవ్వాలని భావించాడు. ఇందులో భాగంగానే ఇండోర్‌లో కుల్దీప్‌ను కలిసి.. తన ఇంటికి రావాలని కోరాడు. దీంతో శారదను తీసుకుని కుల్దీప్.. మంగేశ్ ఇంటికి వెళ్లాడు. ఈ క్రమంలోనే కుల్దీప్ పని మీద బయటకు వెళ్లిన సమయంలో.. శాదకు మంగేశ్ మరింత చేరువయ్యాడు. అకస్మాత్తుగా ఇంటికి తిరిగొచ్చిన కుల్దీప్.. శారద, మంగేశ్‌లను అసభ్యకరమైన స్థితిలో చూసి ఆగ్రహానికి గురయ్యాడు. అనంతరం శారద ఆమె కొడుకు గదిలో నిద్రిస్తుండగా వారిని బలంగా కొట్టి, తర్వాత కత్తితో పీకలు కోసి హత్య చేశాడు. ఈ ఘటన తర్వాత కుల్దీప్ అక్కడ నుంచి పారిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు. అంతేకాకుండా దర్యాప్తు చేసి.. కుల్దీప్‌ను అదుపులోకి తీసుకున్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like
error: Content is protected !!
Karimnagar News page contents