బట్టలు షాపు ఓనర్‌ని ఇంటికి పిలిచిన కిలాడి మహిళ.. ఆ తరువాత ఆమె ఏం చేసిందంటే..

0 7

ఒక బట్టల షాపు నడుపుకునే యువకుడి వద్ద ఓ మహిళ బట్టలు తీసుకొని డబ్బు తరువాత చెల్లిస్తానని చెప్పింది. తెలిసిన మహిళ కదా అని అతను సరేనన్నాడు. మరుసటి రోజు ఆ యువకుడి ఆమెకు ఫోన్ చేయగా.. సాయంత్రం ఇంటికి వచ్చి డబ్బు తీసుకోమని ఆమె చెప్పింది. అతను సాయంత్రం ఆమె ఇంటికి వెళ్లాడు. అక్కడ ఆ యువతి అతనికి కూల్ డ్రింక్‌లో మత్తు కలిపి ఇచ్చింది. అది తాగిన ఆ యువకుడు స్పహ కోల్పోయాడు. ఆ తరువాత ఆ కిలాడి మహిళ ఆ యువకుడితో ఏం చేసిందంటే..

బట్టలు షాపు ఓనర్‌ని ఇంటికి పిలిచిన కిలాడి మహిళ.. ఆ తరువాత ఆమె ఏం చేసిందంటే..

వివరాల్లోకి వెళితే.. మధ్య ప్రదేశ్ రాష్ట్రంలోని గ్వాలియర్ జిల్లాలో జాని(పేరు మార్చబడినది) అనే ఓ యువకుడు బట్టల షాపు నడుపుకొని జీవనం సాగిస్తున్నాడు. నగరంలోని అంబేడ్కర్ కాలనీలో నివసించే ప్రతిమ(పేరు మార్చబడినది) అనే యువతి.. జాని షాపులో కొన్ని బట్టలు కొని డబ్బులు తరువాత చెల్లిస్తానని చెప్పింది. ప్రతిమతో పరిచయం ఉండడంతో జాని సరేనన్నాడు. మరుసటి రోజు ప్రతిమకు డబ్బుల కోసం జాని ఫోన్ చేయగా.. ఆమె సాయంత్రం ఇంటి కొచ్చి డబ్బులు తీసుకోమని చెప్పింది.

ఆ రోజు సాయంత్రం ప్రతిమ ఇంటికి జాని వెళ్లాడు. అతడిని ప్రతిమ ఇంట్లోకి రమ్మని పిలిచి కూల్ డ్రింక్ ఇచ్చింది. కూల్ డ్రింక్ తాగిన జాని కాసేపు తరువాత స్పృహ కోల్పోయాడు. ఆ తరువాత జాని బట్టలు విప్పేసి అతడిని బెడ్‌రూంలోకి తీసుకెళ్లింది. అక్కడ ప్రతిమ కూడా బట్టలు విప్పేసి స్పృహలో లేని జానితో కలిసి నగ్నంగా వీడియో తీసింది.

జానికి కాసేపు తరువాత స్పృహ వచ్చింది. కానీ అతని శరీరంపై బట్టలు లేవు.. పూర్తిగా నగ్నావస్థలో ఉన్నాడు. ఏం జరిగిందోనని షాక్‌లో ఉన్న జానికి ప్రతిమ మరో షాక్ ఇచ్చింది. అతని నగ్న వీడియో చూపించి రూ.50,000 డబ్బు అడిగింది. డబ్బు ఇవ్వకపోతే.. వీడియో వైరల్ చేస్తానని బ్లాక్‌మెయిల్ చేసింది.

ప్రతిమ మాటలతో ఆందోళన చెందిన జాని ఏం చేయాలో తెలియక పోలీస్ స్టేషన్‌కు వెళ్లి జరిగినదంతా చెప్పాడు. పోలీసులు జాని ఇచ్చిన ఫిర్యాదు నమోదు చేసుకొని ప్రతిమ గురించి దర్యాప్తు చేస్తున్నారు. దర్యాప్తులో భాగంగా ప్రతిమ ఇంతకుముందు కూడా ఇలాగే కొంతమందిని బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు అడిగేదని తెలిసింది. కానీ ప్రతిమకు మరో వ్యక్తి సహాయం చేస్తున్నాడని పోలీసుల విచారణ వెల్లడైంది.

Get real time updates directly on you device, subscribe now.

You might also like
error: Content is protected !!
Karimnagar News page contents