కొత్తపల్లిలో ఇంటి ఇంటికి ఫివర్ సర్వే : మునిసిపల్ ఛైర్మన్ రుద్ర రాజు
కరోనా వ్యాధి రోజు రోజుకు విజృంభిస్తున్న కారణంగా ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలని, మస్కులు తప్పకుండా ధరించాలని, అవసరమైతేనే ఇంటినుండి బయటకు వెళ్లాలని తెలియజేశారు. కొత్తపల్లి మునిసిపల్ చైర్మన్ రుద్ర రాజు అన్నారు. కరోనా వ్యాధి నిర్మునలనో భాగంగా ఈరోజు కొత్తపల్లి మున్సిపల్ లోని 7వ వార్డ్ లో తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాల మేరకు ఇంటి ఇంటికి ఫివర్ సర్వే నిర్వహిస్తూ వ్యాక్సినేషన్ ను 7వ వార్డ్ పరిధిలో ప్రారంభించారు మరియు ఆర్పీలకు మునిసిపల్ ఆఫీస్ లో సీడీఎంఏ ఆఫీస్ నుండి పంపిణీ చేసిన సానిటీజర్, మస్కులు, డెటాల్, గ్లోకోజ్ కు సంబంధించి కిట్టులు, పంపిణీ చేసారు.
ఈ కార్యక్రమంలో మునిసిపల్ ఛైర్మన్ రుద్ర రాజు, మున్సిపల్ కమీషనర్ వేణుమాధవ్, జిల్లా మిషన్ కో ఆర్డినెటర్ శ్రీవాణి, బొగ రమేష్, ఏఎన్ఎంలు ఉమ, సంధ్య, మరియు మునిసిపల్ సిబ్బంది పాల్గొన్నారు.