హై జీన్ కిట్లను పంపిణి చేసిన ఎమ్మెల్యే
ప్రభుత్వం తలపెట్టిన ఇంటింటి ఆరోగ్య సర్వేను తగు జాగ్రత్తలు తీసుకుంటూ విజయవంతంగా పూర్తి చేయాలని రామగుండం శాసన సభ్యులు కోరుకంటి చందర్ సిబ్బందికి సూచించారు. రామగుండం నగర పాలక సంస్థ కార్యాలయంలో శుక్రవారం ఇంటింటి ఆరోగ్య సర్వే లో పాల్గొంటున్న మెప్మా ఆర్ పి లకు యునిసెఫ్ సరఫరా చేసిన హై జీన్ కిట్లను పంపిణీ చేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సర్వే సిబ్బంది క్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని అందజేసిన సానిటైజర్, మాస్క్ లతో కూడిన కిట్ ను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సర్వేకి వస్తున్న సిబ్బందికి వాస్తవ వివరాలు అందజేసి ప్రజలు సహకరించాలని కోరారు. రామగుండం నగర మేయర్ బంగి అనిల్ కుమార్ మాట్లాడుతూ కోవిడ్ నిబందనలు పాటిస్తూ ప్రతి ఇంటి ని సందర్శించి నిర్ణీత గడువులోగా ఇంటింటి ఆరోగ్య సర్వే పూర్తి చేయాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు పులేందర్ , శంకర్ నాయక్ , శంకర్, రామగుండం నగర పాలక సంస్థ డిప్యుటీ కమీషనర్ నారాయణ రావు , సెక్రెటరీ రాములు , మెప్మా పి డి అర్బన్ , డి ఎం సి రజనీ , టి ఎం సి శ్వేత , కమ్యూనిటీ ఆర్గనైజర్లు ఆర్ పి లు పాల్గొన్నారు. కాగా రామగుండం నగర పాలక సంస్థ కార్యాలయంలో నిర్వహించిన మరొక కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ కుమార్ దీపక్ కూడా సర్వే లో పాల్గొంటున్న ఎఎన్ఎం, ఆశా కార్యకర్తలకు హైజీన్ కిట్లను అందజేశారు. సర్వే నిర్వహించాల్సిన తీరు గురించి దిశా నిర్దేశం చేసారు. తదుపరి సర్వే జరుగుతున్న తీరును పరిశీలించారు.