42వ డివిజన్ లో వాక్సిన్ కేంద్రం ప్రారంభించిన కార్పోరేటర్
కళ్యాణ్ నగర్ రాజస్థాన్ భవన్ లో 42వ డివిజన్ కార్పొరేటర్ బాలరాజ్ కుమార్ ఆధ్వర్యంలో రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్, నగర మేయర్ బంగి అనిల్ కుమార్, ఆదేశాల మేరకు శుక్రవారం కరోనా వ్యాక్సిన్ సెంటర్ ఏర్పాటు చేశారు. అడ్డగుంటపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మెడికల్ ఆఫీసర్ డాక్టర్ మాణికేశ్వర్ రెడ్డి నిర్వహణలో 15సంవత్సరాలు దాటిన టీనేజర్స్ కి, 1వ డోసు, 2వ డోసు మరియు 60సంవత్సరాలు దాటిన వారికి వ్యాక్సిన్ తీసుకొని 9నెలలు దాటిన వారికి బూస్టర్ డోసు వేస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఎఎన్ఎం స్వప్న, అడిచర్ల మహేందర్, పల్లెల్లో కృష్ణ, తదితరులు పాల్గోన్నారు.