సిటీ కేబుల్ సత్యం కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి గంగుల

0 6

ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన సిటీ కేబుల్ సత్యం (మేకల సత్యనారాయణ ) కుటుంబాన్ని శర్మ నగర్ లోని ఆయన నివాసంలో బిసి సంక్షేమ పౌరసరఫరాల శాఖ మంత్రి వర్యులు శ్రీ గంగుల కమలాకర్ పరామర్శించారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కరీంనగర్ లో గత 20 సంవత్సరాలుగా పత్రికా రంగంలో పరిచయం అక్కర లేని పేరు సిటీ కేబుల్ సత్యం అని ఆయన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. సత్యం కుటుంబానికి మంత్రి గంగుల కమలాకర్ 20 వేల రూపాయల నగదును అందజేశారు. నిరుపేద కుటుంబానికి చెందిన సత్యం కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని ఆయన కుటుంబానికి భరోసా ఇచ్చారు. త్వరలో కరీంనగర్ నియోజకవర్గంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించే దళిత బంద్ పథకంలో సత్యం కుటుంబానికి అందజేస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మంత్రి వెంట స్థానిక కార్పొరేటర్ శ్రీలత – చంద్రశేఖర్ ( మార్షల్ ) స్థానిక నాయకులు ఉన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like
error: Content is protected !!
Karimnagar News page contents