రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
ఆర్టీసీ బస్సు, బైకును ఢీ కొనడంతో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందిన ఘటన రామడుగు మండలం వెదిర గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన వంగల తిరుపతి రెడ్డి తన ద్విచక్ర వాహనంపై గ్రామంలో గల కెనరా బ్యాంక్ ఏటీఎంకు వెళ్లి డబ్బులు తీసుకుని రోడ్డు దాటుతున్న క్రమంలో అటువైపుగా వస్తున్న నర్సంపేటకు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు (TS 03 UA 9555 ) బైక్ను ఢీ కొంది. ఈ ప్రమాదంలో తిరుపతి రెడ్డి అక్కడిక్కడే మృతి చెందాడు. మృతునికి ఒక కొడుకు, కూతురు ఉన్నారు. ఇక ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆర్టీసీ బస్సు, బైకును ఢీ కొనడంతో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందిన ఘటన రామడుగు మండలం వెదిర గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన వంగల తిరుపతి రెడ్డి తన ద్విచక్ర వాహనంపై గ్రామంలో గల కెనరా బ్యాంక్ ఏటీఎంకు వెళ్లి డబ్బులు తీసుకుని రోడ్డు దాటుతున్న క్రమంలో అటువైపుగా వస్తున్న నర్సంపేటకు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు (TS 03 UA 9555 ) బైక్ను ఢీ కొంది. ఈ ప్రమాదంలో తిరుపతి రెడ్డి అక్కడిక్కడే మృతి చెందాడు. మృతునికి ఒక కొడుకు, కూతురు ఉన్నారు. ఇక ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు