ఎమ్మెల్యే వినతితో గ్రామ పంచాయితీలకు నిధులు మంజూరు
జగిత్యాల నియోజకవర్గ అభివృద్ధి పనుల నిమిత్తం ఇటీవల పంచాయితీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావును ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ కలిసి వినతి పత్రం అందజేశారు. గ్రామ పంచాయితీలకు సీసీ రోడ్ల నిమిత్తం 3 కోట్ల 5లక్షలు మంజూరు చేయాలని వినతి పత్రంలో కోరారు.
ఎమ్మెల్యే వినతిపై సానుకూలంగా స్పందిస్తూ సారంగాపూర్ మండలానికి 55 లక్షలు, బీర్పూర్ మండలానికి 50 లక్షలు, రాయికల్ మునిసిపాలిటీ పరిధిలోని గ్రామాలకు 1. 10కోట్లు, జగిత్యాల రూరల్ కు 1. 65 కోట్లు, అర్బన్ కు 40 లక్షలు కేటాయిస్తూ శనివారం ఉత్తర్వులు వెలువడ్డాయి. కోరిన దానికంటే అధిక నిధులిచ్చిన మంత్రి దయాకర్ రావుకు ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు.