సుకుమార్ రావుకు నివాళులు
కరీంనగర్ జిల్లా క్రికేట్ ఆర్గనైజింగ్ సెక్రటరి, ఉత్తమ క్రికేటర్ సుకుమార్ రావుకు నగరపాలక సంస్థకు చెందిన పలువురు పాలక వర్గ సభ్యులు, టీఆర్ఎస్ నాయకులు శ్రద్ధాంజలి ఘటించారు. 33వ డివిజన్ భగత్ నగర్ మేయర్ క్యాంపు కార్యాలయంలో సుకుమార్ రావు చిత్రపటానికి పూల మాలవేసి నివాళులు అర్పించారు. సుకుమార్ రావు శుక్రవారం రోజు అనారోగ్యంతో ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో మృతి చెందాడు.
ఈ నేపథ్యంలో ఆయన సోదరుడైన నగర మేయర్ యాదగిరి సునిల్ రావును పలువురు కార్పోరేటర్లు, టీఆర్ఎస్ నాయకులు పరామర్శించారు. జిల్లా క్రికేట్ అసోసియేషన్ సంఘానికి ఆయన చేసిన సేవలను స్మరించుకుంటూ… సుకుమార్ రావుతో ఉన్న బంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు జంగిలి సాగర్, భూమగౌడ్, ఎదుల్ల రాజశేఖర్, బోనాల శ్రీకాంత్, టీఆర్ఎస్ నాయకులు సుధగోని కృష్ణ గౌడ్, గందె మహేష్, ఎడ్ల అశోక్ తదితరులు పాల్గొన్నారు.