సైబర్ నేరగాళ్ల తో తస్మాత్ జాగ్రత్త : రామగుండం పోలీస్ కమిషనరేట్

0 1
 • సైబర్ నేరగాళ్ల తో తస్మాత్ జాగ్రత్త… ప్రజలు సైబర్ నేరగాళ్లు చూపే మోసపూరిత ఆశలకు గురికావద్దు.
 • సైబర్ నేరం జరిగిన వెంటనే NCRP. పోర్టల్ (www.cybercrime.gov.in) లో ఫిర్యాదు చేయండి.
 • టోల్ ఫ్రీ నెంబర్లు 155260, డయల్ 100, 112 లకు కాల్ చేయండి.: సీపీ ఎస్. చంద్రశేఖర్ రెడ్డి, ఐపీఎస్.

TS Police book 10 Indonesians who had tested positive for Corona

సైబర్ నేరగాళ్లు ఇటీవలి కాలంలో కొత్త కొత్త మార్గాల ద్వారా మోసాలకు పాల్పడుతున్నారు. దేశంలో సైబర్ నేరగాళ్లు మీకు క్రేడిట్ కార్డులు ఇస్తామని, క్యాష్ బ్యాక్ వచ్చిందనే నెపంతో వ్యక్తిగత డేటా, బ్యాంకు ఖాతాలో సొమ్ము కాజేస్తున్నారు. దేశంలో ఇలాంటి సైబర్ నేరాగాళ్ల ఆగడాలు పెరిగిపోతున్నాయి. ఆన్ లైన్ మోసాల ఉచ్చులో పడి చాలా మంది అమాయకులు తాము కష్టపడి సంపాదించిన సొమ్మును పోగొట్టుకుంటున్నారు. తాజాగా సైబర్ నేరగాళ్లు కొత్త పద్ధతుల్లో అమాయకుల నుంచి డబ్బు, వ్యక్తిగత డేటా కాజేస్తున్నట్లు సైబర్ నిపుణులు గుర్తించారు. ఉద్యోగాల , క్రెడిట్ కార్డుల,బ్యాంక్ అకౌంట్ పిన్ చేంజ్ ,లాటరీల ,గిఫ్ట్ ల పేరుతో మోసాలు ఎక్కువగా వెలుగు చూస్తున్నట్లు తెలిపారు. ప్రముఖ బ్యాంకుల పేరుతో నకిలీ ఖాతాలు తెరిచి వాటి ద్వారా మోసాలకు పాల్పడటం ఉచితంగా క్రెడిట్ కార్డ్ ఇస్తామని, భారీ ఆఫర్లు కూడా ఉన్నాయని సైబర్ నేరగాళ్లు నమ్మబలుకుతున్నారు.కొత్తగా క్రెడిట్ కార్డుకోసం ఎదురుచూస్తున్న వారికి కార్డు ఇస్తామని, ఇప్పటికే వాడుతున్న వారికి క్యాష్ బ్యాక్ వచ్చిందని నమ్మిస్తున్నారు, ఆఫర్లకు ఆకర్షితులై నకిలీ ఫేస్బుక్ ఖాతాలో ఉండే సైట్ల ద్వారా ఎవరైనా క్రెడిట్ కార్డుకు దరఖాస్తు చేసుకుంటే.. వారికి సైబర్ నేరగాళ్ల నుంచి కాల్స్ వస్తాయి. నిజమైన బ్యాంకు ఎగ్జిక్యూటివ్ గాని మాట్లాడి.. అవతలి వ్యక్తి నుంచి ఆధార్, పాన్ వివరాలు సహా ఇతర వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తారు.ఇలా సేకరించిన సమాచారాన్ని డీప్ వెబ్లో అమ్మకానికి పెడ్డటం, కొత్త సిమ్ కార్డు కొనుగోలు చేసి నేరాలకు పాల్పడటం వంటివి చేస్తుంటారు. ఎవరైనా వివరాలు చెబితే వారి బ్యాంక్ ఖాతాల నుంచి సైబర్ నేరగాళ్లు గుట్టుచప్పుడు కాకుండా సొమ్ము కాజేస్తున్నారు అని సిపి గారు అన్నారు

ఫిర్యాదు నమోదుకు మీ దగ్గర ఉండాల్సినవి

 • ఫిర్యాదుదారుడి ఫోన్ నంబరు
 • ఖాతా ఉన్న బ్యాంకు పేరు, వాలెట్ పేరు
 • బ్యాంక్ అకౌంట్ నంబరు, వాలెట్, మర్చంట్ ఐడీ, యూపీ ఐడీ నంబర్లు
 • లావాదేవి జరిపిన ఐడీ, తేదీ, సమయం
 • డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా లావాదేవీలు జరిగితే వాటి నంబర్లు
 • మోసానికి సంబంధించిన లావాదేవీలు స్క్రీన్ షాట్లను తీసిపెట్టుకోవాలి

ఫిర్యాదు ఎక్కడ చేయాలి:

 •  సైబర్ క్రైం జాతీయ హెల్ప్ లైన్ టోల్ ఫ్రీ నంబరు 155260/112/100 కాల్ చేసి పిర్యాదు చేయవచ్చు
 • www.cybercrime.gov.in

 

రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఈ వారం రోజుల వ్యవధి లో రిపోర్ట్ అయిన కొన్ని కేసుల వివరాలు…

1. రామగుండం పోలీసు స్టేషన్ పరిధికి చెందిన ఒక బాధితుడికి పార్ట్ టైం జాబ్ గురించి మెసేజ్ వచ్చింది. అందులో ఉన్న లింక్ క్లిక్ చేసి రిజిష్టర్ అయిన తర్వాత WhatsApp లో మరోక లింక్ పంపి, ఈ లింక్ క్లిక్ చేయండి కొన్ని వస్తువులు ఉంటాయి, ముందు మీరు ఆ వస్తువులను మీ డబ్బులతో కొనండి తర్వాత కమిషన్ తోపాటు మీ డబ్బులు మీకు తిరిగి ఇస్తాము అని చెప్పగా, Rs. 71 వేల తో పలు దఫాలుగా కొన్ని వస్తువులను కొన్నాడు. కమిషన్ తో కలుపుకొని మొత్తం డబ్బు వ్యాలెట్ లో కనిపిస్తుంది కానీ డబ్బులు విత్ డ్రా చేసుకోవడానికి కుదరట్లేదు. మీరు మరొక Rs. 61 వేలతో కొనండి అపుడే మొత్తం డబ్బులు విత్ డ్రా చేసుకోవడానికి కుదురుతుంది అంటూ వల విసురుతున్నారు.. ఇదే పద్ధతిలో మందమర్రి పోలీస్ స్టేషన్ పరిధి కి చెందిన మరొక బాధితుడు Rs.51 వేలు మోసపోయాడు.

2. హజిపుర్ పోలీసు స్టేషన్ పరిధికి చెందిన ఒక బాధితుడికి ఫోన్ పే క్యాష్ రివార్డ్ అంటూ గూగుల్ లో ఒక స్క్రాచ్ కార్డు నోటిఫికేషన్ ద్వారా వచ్చింది.. బాధితుడు ఆ స్క్రాచ్ కార్డ్ నీ స్క్రాచ్ చేసి కింద సబ్మిట్ అనే బటన్ ప్రెస్ చేయగా ఫోన్ పే ఓపెన్ అయింది. ఫోన్ పే MPIN ఎంటర్ చేయగా బాధితుడి అకౌంట్ నుంచి RS. 1935/- పోయాయి. ఇదే పద్ధతిలో జన్నారం పోలీస్ స్టేషన్ పరిధిలోని మరోక బాధితుడు Rs. 727/- మోసపోయాడు.

3. మంచిర్యాల్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధి కి చెందిన ఒక బాధితుదడికి Face Book లో ఒక అమ్మాయి అకౌంట్ నుంచి ఫ్రెండ్ రిక్వెస్ట్ రాగా ఆక్స్ సెప్ట్ చేశాడు. వాట్స్ యాప్ నంబర్ లు కూడా మార్చుకుని, న్యుడ్ వీడియో కాల్ చేసుకున్నారు. ఆ అమ్మాయి (సైబర్ నేరగాళ్లు) ఆ కాల్ నీ స్క్రీన్ రికార్డ్ చేసి FB లో అప్ లోడ్ చేస్తాము అంటూ బెదిరిస్తున్నారు. ఇదే పద్ధతిలో చెన్నూర్ పోలీస్ స్టేషన్ పరిధి కి చెందిన మరొక బాధితుడు మోసపోయాడు.

4. ఎన్టిపిసి పోలీస్ స్టేషన్ పరిధి కి చెందిన ఒక బాధితుడు SBI YONO APP open అవ్వడం లేదు ప్రాబ్లం ఏంటో తెలుసుకుందామని గూగుల్ లో కస్టమర్ కేర్ నెంబర్ వెతికి కాల్ చేశాడు. ఆ కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్ ( సైబర్ నేరగాళ్లు) మీ ప్రాబ్లం సాల్వ్ అవ్వాలంటే ANY DESK అప్లికేషన్ డౌన్ లోడ్ చేసుకోండి అని చెప్పగా చేసుకుని, యాక్సిస్ ఐడీ ని కూడా షేర్ చేశాడు. ATM CARD డీటెయిల్స్ కూడా చెప్పేశాడు. ANY DESK అప్లికేషన్ ద్వారా అతనికి వచ్చిన OTP లు చూసిన సైబర్ నేరగాళ్లు Rs. 32 వేలు కొట్టేశారు. ఇదే పద్ధతిలో పోత్కపల్లి పోలీసు స్టేషన్ పరిధి కి చెందిన మరొక బాధితుడు Rs. 48,000/- మోసపోయాడు.

5. పెద్దపల్లి పోలీస్ స్టేషన్ పరిధి కి చెందిన ఒక బాధితుడికి PAN CARD Authorization డీలర్ షిప్ కావాలంటే కాంటాక్ట్ అవ్వండి అంటూ వాట్స్ యాప్ లో మెసేజ్ వచ్చింది. బాధితుడు వారికి పాన్ కార్డు, ఆధార్ కార్డ్, డీటైల్స్ పంపించాడు . డీలర్ షిప్ కావాలి అంటే Rs. 2500 చెల్లించాలి అనగా బాధితుడు చెల్లించినా కూడా మరొక RS 1000 చెల్లించాలి అప్పుడే డీలర్ షిప్ ఇస్తాము అంటూ వల విసురుతున్నారు.

6. పెద్దపల్లి పోలీస్ స్టేషన్ పరిధి కి చెందిన ఒక బాధితుడు కొత్తగా ATM CARD తీసుకున్నాడు కానీ PIN జెనరేట్ చేసుకోలేదు. ఫ్రాడ్ స్టర్ బాధితురాలికి కాల్ చేసి మీ ATM CARD బ్లాక్ అవుతుంది అవ్వకుండా ఉండాలి అంటే కార్డ్ డీటైల్స్ చెప్పాలి అనగా చెప్పింది, తర్వాత OTP లు కూడా చెప్పింది. బాధితురాలి అకౌంట్ నుంచి Rs. 35 వేలు కొట్టేశారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like
error: Content is protected !!
Karimnagar News page contents