చొప్పదండి ఎమ్మెల్యేకి కరోనా పాజిటివ్
చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవి శంకర్ కి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. తనను కలిసిన వారందరూ కరోనా పరీక్షలు చేయించుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. ఏదైనా అత్యవసర పని ఉంటే ఫోను ద్వారా సంప్రదించాలని కోరారు. మాస్కులు, శానిటైజర్ లు విధిగా వాడాలని సూచించారు. ప్రజలు కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరారు.