ఖనిలో జరిగే ఫీవర్ సర్వేను పరిశీలించిన ఎమ్మెల్యే
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన ఇంటింటా ఫీవర్ సర్వే ను శనివారం రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పరిశీలించారు. రామగుండం మునిసిపల్ కార్పొరేషన్ పరిధి 11వడివిజన్ లో వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది, ఏఎన్ఎం, ఆశ వర్కర్లు నిర్వహిస్తున్న సర్వే తీరును పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ,
కరోనా థర్డ్ వేవ్ ఒమిక్రాన్ వేగంగా విస్తరిస్తున్న తరుణంలో ప్రజల ఆరోగ్యమే పరమావదిగా కరోనా ను సమర్ధ వంతంగా తిప్పి కొట్టేందుకు ప్రజలు సహకరించాలన్నారు. సర్వే కోసం వచ్చే వారికి సరియైన వివరాలు అందించి కరోనా వ్యాప్తి నివారణకు తోడ్పడాలన్నారు. కేసులు పెరుగుతున్న దృష్ట్యా కోవిడ్ నిబంధనాలైన మాస్క్, శానిటైజర్ , భౌతిక దూరం పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో తెరాస నాయకులు వడ్డేపల్లి శంకర్, గౌస్ పాషా, శ్రీహరి, యువరాజ్, మెప్మా, ఆశ వర్కర్లు, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గోన్నారు.