సర్వేను పకడ్బందీగా చేపట్టాలి కలెక్టర్ ఆర్. వి. కర్ణన్

0 6

ప్రతి ఇంటికి వెళ్లి జ్వర సర్వేను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్ అన్నారు. నగరంలోని మంకమ్మ తోట, కాశ్మీర్ గడ్డ రైతు బజార్లో ఏఎన్ఎం లు, ఆశా వర్కర్లు, ఆర్పిలు చేస్తున్న ఇంటింటి జ్వర సర్వేను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఇంటి యజమానులతో మాట్లాడారు.
సర్వేను పకడ్బందీగా చేపట్టాలి కలెక్టర్ ఆర్. వి. కర్ణన్
కోవిడ్ మొదటి, రెండవ డోస్ వ్యాక్సినేషను తీసుకున్నారా అని అడుగగా, వారు తీసుకున్నామని తెలిపారు. మంకమ్మ తోటలో సర్వే చేస్తున్న వైద్య సిబ్బంది వద్దకు బూస్టర్ డోస్ తీసుకునేందుకు వచ్చిన కృష్ణవేణి అనే మహిళతో కలెక్టర్ మాట్లాడారు. ఇది వరకు ఎప్పుడైనా కరోనా వచ్చిందా అని అడుగాగ రాలేదని ఆమె తెలిపింది. కాశ్మీర్ గడ్డ లో కరోనా పాజిటివ్ వచ్చిన మహిళకు కలెక్టర్ ధైర్యం చెప్పారు. మందులు సరిగా వాడితే తగ్గుతుందని అన్నారు. అక్కడే ఉన్న వ్యక్తి మాస్క్ ధరించకుండా కనబడగా కలెక్టర్ ఆ వ్యక్తికి మమాస్క్ ఇచ్చి ధరింపజేసారు.

ప్రజలందరూ తప్పనిసరిగా మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని సూచించారు. జ్వరంతో బాధ పడుతున్న వారికి కోవిడ్ పరీక్షలు నిర్వహించి హోం ఐసోలేషన్ ఔషధ కిట్లు అందజేయాలని సర్వే బృందాన్ని ఆదేశించారు. కోవిడ్ లక్షణాలు ఉన్నవారు తప్పనిసరిగా పరీక్షలు చేసుకుని మందులు వాడాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు జిల్లాలో ఇంటింటికి వెళ్లి జ్వర సర్వే నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఇంటింటి ఫీవర్ సర్వే లో జ్వరంతో బాధపడుతున్న వారిని, కోవిద్ లక్షణాలు ఉన్న వారిని గుర్తించి వారికి పరీక్షలు నిర్వహించాలని ఆరోగ్య కార్యకర్తలను కలెక్టర్ ఆదేశించారు. కోవిడ్ లక్షణాలు ఉన్నవారికి హోమ్ ఐసోలేషన్ కిట్స్ అందించాలని అన్నారు. ఏ ఎన్ ఎం, ఆశా వర్కర్లు, అంగన్వాడీ వర్కర్లు, మున్సిపల్, స్వశక్తి మహిళా సంఘ సభ్యులు, ఆర్పిలు బాధ్యతాయుతంగా సర్వేను సక్రమంగా నిర్వహించాలని తెలిపారు.

సర్వే ఐదు రోజుల్లో పూర్తి చేయాలని సూచించారు. కోవిడ్ రెండవ డోస్ వ్యాక్సినేషన్ తీసుకొని వారికి వ్యాక్సిన్ అందజేయాలని అన్నారు. 15 నుండి 18 సంవత్సరాల వయస్సు గల వారికి వ్యాక్సినేషన్ ఇవ్వాలని సూచించారు. ప్రజలందరూ తప్పనిసరిగా మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించెలా అవగాహన కల్పించాలని సర్వే బృందం సభ్యులకు సూచించారు. కోవిడ్ మూడవ దశ ఓమిక్రాన్ ప్రాణాంతకం కాకున్నప్పటికి, ప్రజలు తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలని కలెక్టర్ కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ జువేరియా, మున్సిపల్ కమిషనర్ సేవా ఇస్లావత్, వైద్య సిబ్బంది, సర్వే బృందం సభ్యులు పాల్గొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like
error: Content is protected !!
Karimnagar News page contents