వివాహం చేసుకుని విడాకులు ఇస్తా.. ముందే చెప్పిన సమంత.. ట్వీట్ వైరల్..

0 6

 సినీ ఇండస్ట్రీలో విడాకుల విషయం చాలా కామన్. ఇప్పటికే సీనియర్ నటులు సైతం తమ లైఫ్ పార్ట్‌నర్ నుంచి విడిపోయి కొత్త జీవితం కొనసాగిస్తున్నారు.

Samantha : వివాహం చేసుకుని విడాకులు ఇస్తా.. ముందే చెప్పిన సమంత.. ట్వీట్ వైరల్..

కానీ ఈ ఐదారు నెలల కాలం నుంచి ఈ ట్రెండ్‌లో మరింత స్పీడ్ పెరిగింది. అక్కినేని నాగచైతన్య, సమంత విడిపోవడంతో ఇక చాలా మంది ఇదే బాట పట్టారు. బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్ తన రెండో భార్యకు కూడా విడాకులు ఇచ్చారు.ఇక తాజాగా సూపర్ స్టార్ రజినీకాంత్ పెద్ద కూతురు ఐశ్వర్య, హీరో ధనుష్ కూడా విడిపోతున్నట్టు ప్రకటించారు. మరి వీరి మధ్య గ్యాప్ ఉందని ఎవరికీ తెలియలేదు. చాలా సింపుల్ గానే విడాకులు తీసుకుంటున్నట్టు ప్రకటించారు.

ఇదిలా ఉండగా నాగచైతన్య, సమంత విడాకులు విషయం సోషల్ మీడియాలో ఏదో ఒక రూపంలో చర్చకు వస్తూనే ఉంది.ముందు నుంచే ప్రేమలో ఉన్న నాగచైతన్య, సమంత.. పెద్దల సమక్షంలో 2017లో పెళ్లి చేసుకున్నారు. కానీ వీరి వివాహ బంధం నాలుగేండ్ల కూడా నిలవలేదు. 2021లో విడాకులు తీసుకుని దూరమయ్యారు. పెళ్లికి ముందే వీరిద్దరి కాంబినేషన్‌లో ఏమాయ చేసావే, ఆటోనగర్ సూర్య వంటి మూవీస్ వచ్చాయి. పెళ్లయిన తర్వాత మజిలి మూవీతో వీరిద్దరూ హిట్ అందుకున్నారు. ఇదిలా ఉండగా 2013లో సమంత చేసిన ఓ ట్వీట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది.

ట్విట్టర్‌లో ఫాలోవర్స్‌తో అప్పట్లో సమంత చిట్ చాట్ చేసింది. ఓ అభిమాని సమంతను పెళ్లి గురించి ప్రశ్నించగా.. నేను పెళ్లి చేసుకుంటాను.. తర్వాత డైవర్స్ ఇచ్చేస్తాను.. మీరూ చూస్తూ ఉండండి.. మనం ఇద్దరం కలిసి డ్యాన్స్ చేసేస్తాం అంటూ రిప్లే ఇచ్చింది. ఇప్పుడు నిజంగానే పెళ్లయిన నాలుగేండ్లకే నాగచైతన్యకు విడాకులు ఇచ్చేసింది. ఈ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చెప్పినట్టుగానే పెళ్లి చేసుకుని విడాకులు తీసుకోవడంతో ఆమె ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like
error: Content is protected !!
Karimnagar News page contents