సీఐ కొడుకుల హల్ చల్.. హెల్మెట్ అడిగినందుకు కానిస్టేబుల్‌పై దాడి (వీడియో)
నిత్యం రద్దీగా ఉండే కలెక్టరేట్ రహదారి అది. పోలీసు డిపార్ట్మెంట్ బైక్‌పై ఇద్దరు యువకులు హెల్మెట్ లేకుండా వెళ్తున్నారు. హెల్మెట్ పెట్టుకోవాలని అక్కడే విధులు నిర్వర్తిస్తున్న కానిస్టేబుల్ వారికి సూచించారు. అంతే, తాను సీఐ కొడుకునంటూ ఎదురుదాడికి దిగడంతో ఒక్కసారిగా ట్రాఫిక్ స్తంభించిపోయింది.
కరీంనగర్ జిల్లా కేంద్రంలో శనివారం మధ్యాహ్నం ఈ ఘటన చోటుచేసుకుంది. ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోగా.. తాము సీఐ కొడుకులమంటూ పీసీపై దూషణలకు దిగుతూ దాడికి యత్నించినట్టుగా ఆరోపణలు వచ్చాయి. అయితే సదరు కానిస్టేబుల్ తమపై దాడికి పాల్పడ్డాడంటూ యువకులు కూడా ఆరోపిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ వ్యవహారంపై స్పెషల్ బ్రాంచ్ పోలీసులు వివరాలు సేకరిస్తున్నట్టుగా సమాచారం. యువకున్ని స్థానిక వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.