ఉగ్రమూకతో పోరాడిన సిక్కోలు బాలిక

0 11

శ్రీకాకుళం జిల్లా శ్రీకాకుళం మండలం పొన్నాం గ్రామానికి చెందిన గరుగు సత్యనారాయణ, పద్మావతి దంపతుల కుమార్తె హిమప్రియ. హిమప్రియ 12 ఏళ్ల వయసులోనే శ్రీకాకుళం జిల్లా వారసత్వాన్ని పునికి పుచ్చుకుని సాహసాలకు మారుపేరుగా గుర్తింపు దక్కించుకుంది.

ఈమె తండ్రి ఆర్మీలో పనిచేస్తున్న సమయంలో, ఉద్యోగరీత్యా 2018లో జమ్మూలోని ఆర్మీ క్వార్టర్స్లో కుటుంబంతో కలిసి ఉండేవారు. ఆ సంవత్సరం ఫిబ్రవరి 10న ఉదయం 5 గంటల సమయంలో తీవ్రవాదులు నివసిస్తున్న గృహాలపై భారీ మారణాయుధాలతో దాడి చేశారు. ఆ సమయంలో ఇంటిలో హిమ ప్రియ తల్లి పద్మావతితో కలసి ఉంది. ఈ దాడిలో వారిరువురికి గాయాలపాలైనప్పటికీ హిమప్రియ ధైర్య సాహసాలు ప్రదర్శించి తీవ్రవాదులను ఎదుర్కొంటూ, తల్లితో పాటు క్వార్టర్స్ లో ఉన్న కొంతమందిని కాపాడే ప్రయత్నం చేసింది.

ఆ రోజు ఆమె చూపిన ధైర్య సాహసాలను గుర్తుంచుకుని ప్రతి ఏటా కేంద్రప్రభుత్వం, మహిళా శిశుసంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ధైర్యసాహసాలు ప్రదర్శించే విద్యార్థులకు ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కారాలను ప్రదానం చేస్తుంది. ఈ సందర్భంగానే బాలిక ఈ నెల 24న జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా ఉదయం 11 గంటలకు ప్రధాని నరేంద్ర మోదీ సమక్షంలో వర్చువల్‌ విధానంలోధ్రువీకరణపత్రం, రూ.లక్ష నగదు అందుకోనుంది.

Get real time updates directly on you device, subscribe now.

You might also like
error: Content is protected !!
Karimnagar News page contents