Bride delivery: పెళ్లి వేడుకలో వధువుకు అకస్మాత్తుగా కడుపు నొప్పి.. బిడ్డకు జన్మనిచ్చి తల్లయింది..
అది ఛత్తీస్‌గఢ్ (Chhattisgarh) రాష్ట్రం కొండగావ్ జిల్లాలో ఉన్న చిన్న గిరిజన గ్రామం. అక్కడ ఇటీవల ఓ యువతి వివాహం జరిగింది. పెళ్లి వేడుకల (Wedding celebrations) కు కుటుంబ సభ్యులు, బంధువులు, స్థానికులంతా తరలివచ్చారు. ఉన్నంతలో కన్నుల పండువలా వేడుకను నిర్వహించారు. ఐతే హల్దీ కార్యక్రమం జరుగుతున్న సమయంలో పెళ్లి కూతురుకు కడుపునొప్ని వచ్చింది. క్రమంతా అది తీవ్రమవడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆమెను పరీక్షించిన వైద్యులు అది సాధారణ కడుపునొప్పి కాదని.. పురిటినొప్పులని చెప్పారు. ఆమెకు వైద్యం చేసి డెలివరీ చేశారు. అలా పండంటి మగ బిడ్డకు జన్మినచ్చింది ఆ వధువు. పెళ్లికి ఒక్క రోజు ముందే తల్లయింది.
స్థానికులు చెప్పిన వివరాల ప్రకారం.. ఛత్తీస్‌గఢ్‌లోని కొండగావ్ జిల్లా బడేరాజ్పూర్ మండలం బాన్స్కోట్కు గ్రామానికి చెందిన యువకుడికి ఒడిశాలోని నవరంగ్‌పూర్ జిల్లాకు చెందిన శివబతితో వివాహం నిశ్చయమయింది. బాన్స్కోట్ గ్రామం ఒడిశా సరిహద్దులో ఉంటుంది. ఇరు కుటుంబాల పెద్దలు జనవరి 31న పెళ్లి చేసేందుకు ముహూర్తం ఖరారు చేసుకున్నారు. అంతకు ముందు.. అంటే జనవరి 20న హల్దీ వేడుకలు ఘనంగా జరిగాయి. వధువుకు మండపానికి తీసుకొచి తమ సంప్రదాయం జరగాల్సిన కార్యక్రమాల్లో అందరూ బిజీగా ఉన్నారు. అంతలోనే యువతికి కడుపు నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ ఆమె మగబిడ్డకు జన్మనిచ్చింది. పెళ్లికి ముందు రోజే ఆమె తల్లవడంతో అందరూ రకరకాలుగా చర్చించుకుంటున్నారు. కానీ వధూవరుల కుటుంబ సభ్యులు మాత్రం ఎలాంటి ఆశ్చర్యానికి గురికాలేదు. ఎందుకంటే ఆమెకు కాబోయే భర్తే.. ఆబిడ్డకు తండ్రి. పెళ్లికి ముందు రోజే బిడ్డకు జన్మనివ్వడంతో..ఆ కుటుంబాల్లో సంతోషం మరింత రెట్టింపయింది.
వధువు శివబతి తల్లి సరిత మాండవి ఈ వివాహం గురించి మరిన్ని వివరాలను పంచుకున్నారను. ఈమె చెప్పిన వివరాల ప్రకారం.. గిరిజన పెళ్లి వేడుకల్లో ఇప్పటికీ పైతు విధానం అమలవుతోంది. ఈ ఆచారం ప్రకారం.. ఎవరైనా అమ్మాయి ఎవరైనా అబ్బాయిని ఇష్టపడితే.. వారి ఇంటికి వెళ్లి ఆరునెలలు గడపాల్సి ఉంటుంది. ఆ సమయంలో వారిద్దరు అన్యోన్యంగా ఉంది.. అతడినే పెళ్లి చేసుకుంటానని వధువు చెప్పితే.. అప్పుడు వివాహం చేసుకుంటారు. ఈ ఆచారంలో భాగంగా గత ఏడాది ఆగస్టులో శ్రీ కృష్ణ జన్మాష్టమి రోజున శివబతి.. బాన్స్కోట్కు చెందిన చందన్ నేతమ్ ఇంటికి వెళ్లింది. ఆరు నెలలు గడిచిన తర్వాత.. వీరిద్దరికి వివాహం నిశ్చయించారు. అప్పటికే శివబతి గర్భవతని ఇరు కుటుంబాలకు తెలుసు. అలా తమ సంప్రదాయం ప్రకారం.. ఆరు నెలల తర్వాత పెళ్లి జరిపించారు. కానీ సరిగ్గా హల్దీ వేడుక రోజే ఆమె డెలివరీ కావడంతో ఈ పెళ్లి స్థానికంగా హాట్ టాపిక్ అయింది. ఇక జనవరి 31న మరింత ఉత్సాహంతో పెళ్లిని ఘనంగా జరిపిచారు.