పెరిగిన సిమెంట్‌ధరలు..
రాష్ట్ర వ్యాప్తంగా సిమెంట్‌ధరలు పెరిగాయి. 50 కిలోల బస్తాపై రూ.30 పెరిగినట్లు వ్యాపారులు చెబుతున్నారు.ఈ నెల మొదట్నుంచే కొత్త ధరలతో విక్రయాలు జరుపుతున్నట్లు స్పష్టం చేశారు.
దీంతో హౌసింగ్ రంగంపై ప్రభావం పడింది. గృహ, ఇతర ప్రాజెక్టుల నిర్మాణాల కొరకు ఇప్పటికే కాంట్రాక్ట్తీసుకున్నోళ్లకు సిమెంట్బారం పడుతుంది. ఉత్పత్తి తగ్గి, డిమాండ్పెరగడంతోనే ధరలు పెరిగినట్లు డీలర్లు చెబుతున్నారు. కొత్త ధరల పెంపు తర్వాత, బ్రాండ్, ప్రదేశాన్ని బట్టి 50 కిలోల సిమెంట్ బస్తా 310-370 రూపాయలకు అమ్ముతున్నారు. అల్ట్రాటెక్ సిమెంట్ లిమిటెడ్, ఇండియా సిమెంట్స్ లిమిటెడ్, కెసిపి లిమిటెడ్, రామ్‌కో సిమెంట్స్ లిమిటెడ్, ఓరియంట్ సిమెంట్ లిమిటెడ్, ఎన్సిఎల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, సాగర్ సిమెంట్స్ లిమిటెడ్, దాల్మియా భారత్ లిమిటెడ్ మరియు శ్రీ సిమెంట్‌తో సహా అన్ని ప్రైవేట్ సిమెంట్ తయారీదారులు ధరలు పెంచేశారు.