ప్రముఖ క్రికెటర్ తండ్రి కన్నుమూత
టీమిండియా మాజీ ఆల్ రౌండర్ సురేష్ రైనా తండ్రి త్రిలోక్‌చంద్ రైనా ఆదివారం కన్నుమూశారు. కేన్సర్‌తో బాధపడుతూ ఘజియాబాద్‌లోని తన నివాసంలో మరణించారు. సైనిక అధికారిగా, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో బాంబులు తయారు చేయడంలో ప్రావీణ్యం ఉన్న వ్యక్తిగా ఆయన పేరుగాంచారు.
రైనా తండ్రి పూర్వీకుల గ్రామం భారతదేశంలోని జమ్మూ & కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతంలోని ‘రైనావారి’. 1990లలో కాశ్మీర్ పండిట్ల హత్యల తర్వాత ఆయన తండ్రి స్వస్థలాన్ని విడిచిపెట్టాడు. వారి కుటుంబం మురాద్‌నగర్ పట్టణంలో స్థిరపడింది. రైనా తండ్రికి తొలుత రూ.10 వేల జీతం మాత్రమే వచ్చేది. కుటుంబ ఖర్చులకు, రైనా కోచింగ్ ఫీజుకు అది ఏమాత్రం సరిపోయేది కాదు. ఏదైమైనా ఆ తర్వాత రైనాను 1998లో లక్నోలోని గురుగోవింద్ సింగ్ స్పోర్ట్స్ కాలేజీలో ఆయన చేర్పించారు. తన కొడుకుకు ఇష్టమైన క్రీడలో నైపుణ్యం పెంపొందించేందుకు ఆయన ఎన్నో త్యాగాలు చేశారు.