చివరి ఓవర్‌కు వరకు ఉత్కంఠ.. 8 పరుగుల తేడాతో భారత్ విజయం.. సిరీస్ కైవసం..
శుక్రవారం కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ స్టేడియంలో వెస్టిండీస్‌తో జరిగిన రెండో టీ20 ఇంటర్నేషనల్‌లో టీమిండియా ఘన విజయం సాధించింది.
చివరి ఓవర్ వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచులో టీమిండియా 8 పరుగుల తేడాతో విజయం సాధించి మూడు టీ20ఐ సిరీస్‌లో 2-0 తేడాతో విజయం సాధించింది. 18వ ఓవర్ వేసిన భువనేశ్వర్ అద్భుతంగా బౌలింగ్ చేసి కేవలం 4 పరుగులు మాత్రమే ఇచ్చి ఒక వికెట్ పడగొట్టాడు. ఇక చివరి ఓవర్లో 24 పరుగులు కావాల్సిన తరుణంలో హర్షల్ పటేల్ కూడా సూపర్బ్‌గా వేయడంలో వెస్టిండీస్ టీం కేవలం 16 పరుగులు మాత్రమే సాధించింది. దీంతో విజాయానికి 7 పరుగులు దూరంలో నిలిచింది. మొత్తంగా విండీస్ 20 ఓవర్లతో 3 వికెట్లు కోల్పోయి 178 పరుగులు మాత్రమే చేసింది. విండీస్ టీంలో పావెల్ 68 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.
వెస్ట్ ఇండిస్తో జరుగుతోన్న రెండో టీ20 మ్యాచ్‌ను గెలుచుకొని సిరీస్‌ను కైవసం చేసుకోవాలని టీమిండియా చూస్తోంది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరుగుతోన్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన వెస్టిండిస్ ఫీల్డింగ్ ఎంచుకుంది. మరి రెండో టీ20లో కూడా భారత్ విజయ పరంపరను కొనసాగిస్తుందా.? సిరీస్‌ను సొంతం చేసుకుంటుందా.? చూడాలి.
ఇదిలా ఉంటే ఈ మ్యాచ్‌లో భారత్ మార్పులు లేకుండా బరిలోకి దిగుతుండగా, విండీస్ ఒకే ఒక మార్పుతో బరిలోకి దిగింది. ఫాబియాన్ అలెన్ స్ధానంలో జాసన్ హోల్డర్ జట్టులోకి వచ్చాడు.
తుది జట్లు ఇలా ఉన్నాయి..
భారత తుది జట్టు: ఇషాన్ కిషన్, రోహిత్ శర్మ(కెప్టెన్), విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, రిషభ్ పంత్(వికెట్ కీపర్), వెంకటేశ్ అయ్యర్, దీపక్ చహర్, భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, రవి బిష్ణోయ్, యజువేంద్ర చహల్
వెస్టిండీస్ తుది జట్టు: బ్రాండన్ కింగ్, కైల్ మేయెర్స్, నికోలస్ పూరన్(వికెట్ కీపర్), పావెల్, కీరన్ పొలార్డ్(కెప్టెన్), రోస్టన్ చేజ్, రొమారియో షెపర్డ్, ఓడియన్ స్మిత్, అకీల్ హొసేన్, షెల్డన్ కాట్రెల్,జాసన్ హోల్డర్