గుండెపోటుతో షేన్ వార్న్ కన్నుమూత
ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్, లెజెండరీ స్పిన్నర్ షేన్ వార్న్(52) గుండెపోటుతో కన్నుమూశారు. థాయిలాండ్ లో ఉన్న ఆయనకు శుక్రవారం గుండెపోటు రావడంతో ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే వార్న్ కన్నుమూసినట్లు వైద్యులు తెలిపారు. షేన్ వార్న్ ఆస్ట్రేలియా తరపున 145 టెస్టుల్లో 708 వికెట్లు, 194 వన్డేల్లో 293 వికెట్లు పడగొట్టారు.